Comedian Raghu : పాపం… మ‌ద్యం అమ్ముతూ క‌నిపించిన క‌మెడియ‌న్ ర‌ఘు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Comedian Raghu : పాపం… మ‌ద్యం అమ్ముతూ క‌నిపించిన క‌మెడియ‌న్ ర‌ఘు…!

 Authored By kranthi | The Telugu News | Updated on :3 December 2021,9:40 am

తెలుగు సినీ కమెడియన్, యాక్టర్ రఘ… ఓ వైన్ షాప్ లో మ‌ద్యం అమ్ముతూ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇదంతా షూటింగ్ లో భాగంగా అనుకుంటే పొరపాటే. నిజంగానే ఆయన వైన్ బాటిల్ లను స్వయంగా కస్టమర్లకు అందించారు. ఎప్పటినుంచో సినిమాల్లో నటిస్తున్న రఘుకు నిజంగానే అంత కష్టం ఇచ్చి పడిందట. ఒకప్పుడు సినిమాలు, షోలతో బిజీ బిజీగా గడిపిన రఘు… కరోనా కారణంగా అవకాశాలు కోల్పోయారు. దీంతో చేసేదేమీ లేక ఆయన వ్యాపా అడుగులు వేశారు. లిక్కర్ బిజినెస్ లో పాల్గొనాలని భావించిన రఘు… ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో పాల్గొన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడలో 2 వైన్ షాపులను చేజిక్కించుకున్నారు.

నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన ఆయా షాపులను రఘు స్వయంగా ప్రారంభించారు. కస్టమర్లకు తానే మద్యాన్ని అమ్ముతూ కాసేపు సరదాగా గడిపారు. ఇదే కాక… కరోనా మొదట దశలోనే రఘు తన ఇంటి చుట్టూ కూరగాయాల పెంపకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పంట అనుకున్నట్టు రావడంతో… కొన్ని ఏకరాలు కౌలుకు తీసుకుని మరీ వ్యవసాయం చేస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా పరిస్థితుల కారణంగానే ఆయన వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు ఆయన తెలిపారు.

comedian raghu stepped in to wines business

comedian raghu stepped in to wines business

Comedian Raghu మద్యం వ్యాపారంలోకి కమెడియన్ రఘు

కమెడియ‌న్ రఘు… ఆది, దిల్, అదుర్స్, యోగి వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి హాస్యాన్ని పండించారు. దాంతో అప్పుడప్పుడు జ‌బ‌ర్థ‌స్త్, అలీతో సరదాగా లాంటి షో లలో పాల్గొంటూ ఆడియన్స్ తో టచ్ లోనే ఉన్నారు. రఘు తన మద్యం దుకాణంలో వైన్ అమ్ముతున్న ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. కొత్త వ్యాపారం లోకి అడుగుపెట్టిన రఘుకు అతని అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది