Rohini : నాకు పెళ్లి కాదా, స‌ర్జ‌రీ చేయించుకున్నాను.. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ రోహిణి ఫైర్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 13, 2024, 7:00 pm

Rohini : బుల్లితెర న‌టి రోహిణి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ నవ్వించేస్తోంది. రీసెంట్‌గా సేవ్ ది టైగర్స్ రెండో సీజన్‌లో అదరగొట్టేసింది. ఇక సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలను దక్కించుకుంటోంది. లేడీ కమెడియన్లు లేని లోటుని రోహిణి భర్తీ చేస్తోంది.. సిల్వర్ స్క్రీన్ పై కూడా రోహిణి రాణిస్తుంది. బలగం వంటి బ్లాక్ బస్టర్ మూవీలో ఓ కామెడీ రోల్ చేసింది. వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో రోహిణి పాత్ర చాలా హిలేరియస్ గా ఉంటుంది. కాగా ఇటీవల రోహిణి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వీడియోలో రోహిణి ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిణి ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Rohini రోహిణికి కోపం క‌ట్టలు తెంచుకుంది..

నాకేమి తెలియదు. నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఎన్నారై బర్త్ డే పార్టీ అంటే వచ్చానని… ఆ వీడియోలో రోహిణి బ్రతిమిలాడుకున్నారు. రోహిణి అరెస్ట్ పై ఎలాంటి న్యూస్ లేదు. దీంతో రోహిణి ఫ్రాంక్ చేశారని అందరికీ క్లారిటీ వచ్చింది. బర్త్ డే బాయ్ అనే ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రోహిణి రేవ్ పార్టీకి హాజరై అరెస్ట్ అయినట్లు ఫేక్ వీడియో చేసింది. అయితే ఈ వీడియో నిజమే అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్స్ చేసిన తరుణంలో రోహిణి స్పందించారు. ఒకింత ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. రోహిణి ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియో బైట్ వదిలింది. నేను ఇటీవల బర్త్ డే బాయ్ మూవీ ప్రమోషన్స్ కోసం రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఫ్రాంక్ వీడియో చేశాను.

Rohini : నాకు పెళ్లి కాదా, స‌ర్జ‌రీ చేయించుకున్నాను.. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ రోహిణి ఫైర్..!

Rohini : నాకు పెళ్లి కాదా, స‌ర్జ‌రీ చేయించుకున్నాను.. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అంటూ రోహిణి ఫైర్..!

అది ఫేక్ వీడియో అని మీడియా వాళ్ళు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు చేసిన కామెంట్స్ ఇబ్బంది పెట్టాయి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. ఆమె డ్రగ్స్ తీసుకునే ఉంటుంది. అందుకే పోలీసులు పట్టుకున్నారని అంటారా? మీరు పర్సనల్ గా కూడా నా మీద అటాక్ చేశారు. ఆమెకు సర్జరీ జరగడం వలన బరువు పెరిగింది. పెళ్లి కూడా చేసుకునే ఆలోచన లేదేమో అన్నారు. లావుగా ఉన్నోళ్లకు పెళ్లిళ్లు కావా? పెళ్లి చేసుకోకూడదా?. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకొకరిని అయితే చెప్పుతో కొట్టేదాన్ని. నాకు మందు అలవాటు కూడా లేదు. సినిమాల్లో చేసినవన్నీ నిజ జీవితంలో చేస్తారా? సీనియర్ జర్నలిస్ట్ గా ఒక సంఘటన జరిగితే… అది నిజమా? అబద్దమా? అని తెలుసుకుని మాట్లాడాలి. మీకు పనిలేక పోతే, ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోండి. ఇలాంటి కామెంట్స్ చేయకండి… అంటూ రోహిణి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp