Sreemukhi : దెబ్బకు శ్రీముఖి మొహం మాడింది.. పరువుతీసిన కమెడియన్ సద్దాం

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 8:20 pm

Sreemukhi : శ్రీముఖి సద్దాం కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అదిరింది, బొమ్మ అదిరింది అనే షోల్లో ఈ కాంబో బాగానే సెట్ అయింది. శ్రీముఖి మీద సద్దాం ఫుల్ సెటైర్లు వేస్తుంటాడు. ప్రతీసారి ఆమె బాడీ మీద కామెంట్లు వేస్తుంటాడు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో అయితే శ్రీముఖి పరువు తీసేశాడు సద్దాం. జీ తెలుగులో బోనాల జాతర అంటూ ఓ ఈవెంట్‌ను చేస్తున్నారు. ఇందులో శ్రీముఖి యాంకర్‌గా వచ్చింది. జీ తెలుగు, స్టార్ మా సీరియల్ తారలను అందులోకి తీసుకొచ్చారు. ఇక సద్దాం కౌంటర్లకు అందరూ నవ్వేశారు. స్టేజ్ మీదకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ జాతర అంటే ఏంటి? అని అడుగుతూ వచ్చింది శ్రీముఖి. ఇక సద్దాం వంతు వచ్చింది. సద్దాంను కూడా అదే ప్రశ్న అడిగింది.

జాతర అంటే ఏంటి? అని శ్రీముఖి అడిగితే.. జాతర అంటే జాతరే అని కౌంటర్ వేయడంతో ఆమె మొహం మాడిపోయినట్టు చూపించారు. జాతరలో నువ్వేం చేస్తావ్ అని ఇంకోసారి అడుగుతుంది. నువ్వైతే మందు తాగుతావ్ అది చెప్పు అని శ్రీముఖి పరువుతీస్తాడు సద్దాం. ఒరేయ్ నా కొడకా అంటూ శ్రీముఖి రెచ్చిపోతుంది. అలా సద్దాం కౌంటర్లకు హద్దే లేకుండా పోతుంది. ఇంకో సందర్భంలో సీరియల్ తారలకు యాంకరింగ్ అంటే ఏంటి? ఎలా నడుచుకోవాలి.. ఎలా నిల్చోవాలి అని శ్రీముఖి నేర్పిస్తుంటుంది. ఏంటి ఇప్పుడు వాళ్లకు యాంకరింగ్ నేర్పిస్తున్నావా? అని సద్దాం ప్రశ్నిస్తాడు. అవును అని శ్రీముఖి అంటుంది. ముందు నువ్ యాంకర్ అవ్వు..

comedian saddam satires on sreemukhi in zee telugu jathara

comedian saddam satires on sreemukhi in zee telugu jathara

యాంకరింగ్ చేయ్ అన్నట్టుగా శ్రీముఖి పరువుతీస్తాడు సద్దాం. అలా సద్దాం వేసిన పంచ్‌లకు అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. అలా ఈ ప్రోమోలో శ్రీముఖికి వరుసగా పంచులు పడుతుంటాయి. అయితే ఈ ప్రోమోలో రోహిణి మాత్రం రఫ్ఫాడించేసింది. చివరకు దుల్కర్ సల్మాన్, సుమంత్‌లను కూడా ఆడేసుకుంది. సిగ్గు లేని దాన్ని అంటూ తనను తక్కువ చేసుకుని అందరినీ నవ్వించేసింది. ఇక ఈ ప్రోమోలో దుల్కర్ మంచి మనసు గొప్పదనం బయటకు వచ్చింది. రియాజ్ వచ్చి ఫోటో కోసం నిలబడితే.. దుల్కర్ కిందకు వంగి నేల మీద కూర్చుంటాడు.

aruna

No bio available for this author.

  1. "Gudivada Politics : గుడివాడలో అగ్గి రాజుకుంటోంది.. కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి ఖాయమా..?!"

  2. "Dimple Hayathi : శర్వానంద్‌తో పెళ్లి వార్తలపై డింపుల్ హయాతి క్లారిటీ..!"

  3. "Gold Rate Today : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. . నేటి రేట్లివే!"

  4. "Narendra Modi : ఏకంగా ఆ స్థాయికి చేరుకున్న మోదీ.. ఈ లెక్కలు చూస్తే రాహుల్‌కు నిద్ర పట్టదు..!"

  5. "YS Jagan Ys sharmila : తల్లి, చెల్లి రోడ్డుమీద పడటానికి కారణం ఆయనేనట.. యలహంక ప్యాలెస్ రచ్చలో సరికొత్త ట్విస్ట్..!"

  6. "Naga Chaitanya : లోలోపల ఏడవాలనిపిస్తుంది.. కానీ కన్నీళ్లు రావు.. నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!"

  7. "Miss Universe 2026 Jennifer Barreto : మిస్ యూనివర్స్ 2026 విజేత జెన్నిఫర్ బర్రెటో.. టాప్-12లో చోటు దక్కని భారత్‌..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp