Home » Entertainment » Comedian Saddam Satires On Sreemukhi In Zee Telugu Jathara
Entertainment

Sreemukhi : దెబ్బకు శ్రీముఖి మొహం మాడింది.. పరువుతీసిన కమెడియన్ సద్దాం

Authored By
aruna
The Telugu News | Published on: July 31, 2022, 8:20 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి సద్దాం కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అదిరింది, బొమ్మ అదిరింది అనే షోల్లో ఈ కాంబో బాగానే సెట్ అయింది. శ్రీముఖి మీద సద్దాం ఫుల్ సెటైర్లు వేస్తుంటాడు. ప్రతీసారి ఆమె బాడీ మీద కామెంట్లు వేస్తుంటాడు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో అయితే శ్రీముఖి పరువు తీసేశాడు సద్దాం. జీ తెలుగులో బోనాల జాతర అంటూ ఓ ఈవెంట్‌ను చేస్తున్నారు. ఇందులో శ్రీముఖి యాంకర్‌గా వచ్చింది. జీ తెలుగు, స్టార్ మా సీరియల్ తారలను అందులోకి తీసుకొచ్చారు. ఇక సద్దాం కౌంటర్లకు అందరూ నవ్వేశారు. స్టేజ్ మీదకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ జాతర అంటే ఏంటి? అని అడుగుతూ వచ్చింది శ్రీముఖి. ఇక సద్దాం వంతు వచ్చింది. సద్దాంను కూడా అదే ప్రశ్న అడిగింది.

Advertisement

జాతర అంటే ఏంటి? అని శ్రీముఖి అడిగితే.. జాతర అంటే జాతరే అని కౌంటర్ వేయడంతో ఆమె మొహం మాడిపోయినట్టు చూపించారు. జాతరలో నువ్వేం చేస్తావ్ అని ఇంకోసారి అడుగుతుంది. నువ్వైతే మందు తాగుతావ్ అది చెప్పు అని శ్రీముఖి పరువుతీస్తాడు సద్దాం. ఒరేయ్ నా కొడకా అంటూ శ్రీముఖి రెచ్చిపోతుంది. అలా సద్దాం కౌంటర్లకు హద్దే లేకుండా పోతుంది. ఇంకో సందర్భంలో సీరియల్ తారలకు యాంకరింగ్ అంటే ఏంటి? ఎలా నడుచుకోవాలి.. ఎలా నిల్చోవాలి అని శ్రీముఖి నేర్పిస్తుంటుంది. ఏంటి ఇప్పుడు వాళ్లకు యాంకరింగ్ నేర్పిస్తున్నావా? అని సద్దాం ప్రశ్నిస్తాడు. అవును అని శ్రీముఖి అంటుంది. ముందు నువ్ యాంకర్ అవ్వు..

comedian saddam satires on sreemukhi in zee telugu jathara

Advertisement

యాంకరింగ్ చేయ్ అన్నట్టుగా శ్రీముఖి పరువుతీస్తాడు సద్దాం. అలా సద్దాం వేసిన పంచ్‌లకు అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. అలా ఈ ప్రోమోలో శ్రీముఖికి వరుసగా పంచులు పడుతుంటాయి. అయితే ఈ ప్రోమోలో రోహిణి మాత్రం రఫ్ఫాడించేసింది. చివరకు దుల్కర్ సల్మాన్, సుమంత్‌లను కూడా ఆడేసుకుంది. సిగ్గు లేని దాన్ని అంటూ తనను తక్కువ చేసుకుని అందరినీ నవ్వించేసింది. ఇక ఈ ప్రోమోలో దుల్కర్ మంచి మనసు గొప్పదనం బయటకు వచ్చింది. రియాజ్ వచ్చి ఫోటో కోసం నిలబడితే.. దుల్కర్ కిందకు వంగి నేల మీద కూర్చుంటాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి