Home » Entertainment » Comedian Sudarshan On Siri Shannu Romance In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : బయట ఇద్దరున్నారని గుర్తు పెట్టుకోండి!.. సిరి, షన్నుల రొమాన్స్‌పై కమెడియన్ సుదర్శన్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 22, 2021, 11:35 am
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల హగ్గులు, రొమాన్స్, కిస్సుల గురించి అందరికీ తెలిసిందే. అనుభవించు రాజా టీం నిన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, సుదర్శన్ వచ్చారు. ఈ క్రమంలో ఇంటిసభ్యులతో ముచ్చటించారు. అయితే సుదర్శన్ మాత్రం నిత్యం బిగ్ బాస్ షోను ఫాలో అవుతాడంటా. అందరి గురించి కొన్ని కామెంట్లు చేశాడు. సన్నీ ఫైర్ అయితే మాకు నవ్వొస్తుంటుంది అని చెప్పేశాడు.

Advertisement

ఎందుకు ఫైర్ అవుతాడో తెలీదు.. మాకు నవ్వొస్తుంది.. ఎడిటింగ్‌లో పోయి ఉంటుందని అనుకుంటాం.. కానీ అక్కడ కూడా ఉండదని తెలిసిందంటూ సుదర్శన్ అనేశాడు. దీంతో సన్నీని కమెడియన్ చేసేసినట్టు అయింది. కోపానికి కారణం ఉండాలి కదా? అంటూ నాగార్జున కూడా సన్నీ పరువుతీసేశాడు. అలా మొత్తానికి సుదర్శన్ అందరి మీద సెటైర్లు వేశాడు. ఇక సిరి, షన్నుల మీద కూడా కౌంటర్లు వేశాడు. బయట ఇద్దరున్నారని గుర్తు పెట్టుకోండని కౌంటర్ వేశాడు.

Comedian Sudarshan On Siri Shannu Romance In Bigg Boss 5 Telugu

Advertisement

Bigg Boss 5 Telugu : సిరి, షన్నుల రొమాన్స్..

అడక్కుండానే చెప్పావా.. థ్యాంక్స్ అంటూ షన్ను, సిరిలు సుదర్శన్‌కు రివర్స్ కౌంటర్ వేశారు. మొత్తానికి తామిద్దరి ట్రాక్ ఎలా బయటకు వెళ్తోందనే విషయంపై ఓ అవగాహన వచ్చేసినట్టు అయింది. మరి ఇప్పటికైనా వారు కాస్త దూరంగా ఉంటారా? ఆ రొమాన్స్‌ను పక్కకు పెట్టేస్తారా? అన్నది చూడాలి. సిరి, షన్నులు కాస్త శ్రుతి మించిపోతోన్నారనే వాదన ఇప్పటికే నెట్టింట్లో ఎక్కువగా మార్మోగిపోతోంది. మరి బయటి నుంచి వచ్చిన గెస్టులు కూడా అలానే అనడంతో షాక్ అయి ఉంటారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి