Vidyullekha Raman : లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ భర్త ఇతడే.. స్టేజ్ మీద అదరగొట్టేశాడుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidyullekha Raman : లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ భర్త ఇతడే.. స్టేజ్ మీద అదరగొట్టేశాడుగా

 Authored By aruna | The Telugu News | Updated on :31 July 2022,7:20 pm

Vidyullekha Raman : లేడీ కెమెడియన్లు ఉండటమే చాలా అరుదు. అలాంటిది తమిళం నుంచి తెలుగులో మంచి కమెడియన్‌గా పేరు సంపాదించుకుంది విద్యుల్లేఖ రామన్. హీరోయిన్ ఫ్రెండ్స్‌గా, సైడ్ ఆర్టిస్ట్‌గా నవ్వులు పూయిస్తుంటుంది విద్యుల్లేఖ. అలాంటి కమెడియన్‌కు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ మధ్య ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే మధ్యలో ఆమె హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నించింది. ఇక తన లావు తనకు కలిసి వచ్చింది. అదే లావు తనకు అవకాశాలను రాకుండా చేసింది. ఎక్కువ లావు అవుతోందన్న కారణంతో ఆఫర్లు తగ్గిపోయాయట. అయితే ఆ మధ్య విద్యుల్లేఖ ఎంతో కష్టపడి, ఎన్నో వ్యాయామాలు చేసి కాస్త తగ్గింది.

ఆమె బరువు తగ్గిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక విద్యుల్లేఖ హీరోయిన్‌గానూ ప్రయత్నాలు చేసింది. అయితే విద్యుల్లేఖ రామన్ ప్రేమ, పెళ్లి విషయాలు కూడా నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ప్రేమ వివాహాం చేసుకున్న విద్యుల్లేఖ తాజాగా తన భర్తను స్టేజ్ మీదకు తీసుకొచ్చింది. అందరికీ పరిచయం చేసింది. స్టేజ్ మీదకు తీసుకొచ్చిన విద్యుల్లేఖ రామన్ తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పింది. ఇక ఆమె భర్త మాత్రం సెటైర్లతో ఆడుకున్నాడు. పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంది? అంటూ శ్రీముఖి అడిగింది. అదంతా అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ అసలు విషయం చెప్పుకుండా దాటేశాడు.

Comedian Vidyullekha Raman And Her Husband In Zee Telugu Bonalu Jathara

Comedian Vidyullekha Raman And Her Husband In Zee Telugu Bonalu Jathara

ఇక విద్యుల్లేఖ రామన్ అయితే ప్రేమ గురించి చెప్పింది. 2019లో తమఇద్దరి పరిచయం జరిగిందని, కొన్నాళ్లు ఎలా ఉంటామో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అని చూశా..తరువాత పెళ్లి చేసుకున్నామని విద్యుల్లేఖ చెప్పింది. మరి కెమిస్ట్రీ ఎలా ఉందని శ్రీముఖి కొంటెగా అడిగితే.. విద్యుల్లేఖ తన స్టైల్లో కామెడీ చేస్తూ తమ మధ్య ఉన్న బంధం గురించి చెప్పేసింది. అలా ఈ ప్రోమోలో విద్యుల్లేఖ తన భర్తను మొదటి సారిగా తెర ముందుకు తీసుకొచ్చినట్టు అయింది. అంతే కాకుండా దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరో సైతం ఈ ఈవెంట్‌కు వచ్చిన తన సీతారామం సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది