Bhanu Sree : యాంకర్ భాను శ్రీ ను అందరిముందే ఇంటికి రమ్మని పిలిచిన కమెడియన్ ఆలీ..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 25, 2021, 8:50 pm

Bhanu Sree : ఆలీ.. పేరు వినగానే సినీ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు విరబుస్తాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంది కమెడియన్స్ ఉన్నా… వారిలో ఆలి ప్రత్యేకమే. కొన్నేళ్లుగా ఇయన టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. సినిమాలే కాక ఈ మధ్య బుల్లి తెరపై కూడా మెరుస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య ఓ ఆడియో రిలీజ్ వేదికపై యాంకర్ సుమ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అలీ పై పెద్ద ఎత్తున విమర్శలు రాగా… అప్పటికప్పుడు ఆయనతో పాటు సుమ కూడా తమకు తాము వివరణ ఇవ్వక తప్పలేదు. అయితే ఇదిలా ఉండగా తాజాగా కమెడియన్ అలీ యాంకర్ భాను పై చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

న్యూ ఇయర్ వేడుకలో భాగంగా జీ తెలుగు ఛానెల్ లో రాబోతున్న దావత్ అనే ప్రోగ్రాంకు అలీ, నటుడు నాగబాబు సహా అతిథిగా హాజరయ్యారు. వ్యాఖ్యాతగా యాంకర్ ప్రదీప్, ఉదయభాను వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని యూట్యూబ్ లో వదలాగా.. షో లో భాగంగా మాట్లాడిన పలు డైలాగ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దావత్ ఇవ్వడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచామని యాంకర్ ప్రదీప్ అలీతో చెప్పగా… నేనెందుకు ఇస్తాను అని ఆలీ ఫన్నీగా బదులిచ్చాడు. ఇక వెంటనే అందుకున్న ప్రదీప్.. అదేంటి మీరు ఎవరు ఏం అడిగిన ఇస్తారు కదా సర్ అని అడిగాడు.

comediyan ali calls anchor Bhanu Sree to his house for a party

comediyan ali calls anchor Bhanu Sree to his house for a party

Bhanu Sree : మా ఇంటికి వచ్చేయ్ అని పిలిచినా ఆలీ..!

ఇక ఆలీ తనదైన శైలిలో స్పందిస్తూ.. ఎవరేం అడిగినా ఇచ్చేయడానికి నేను పవన్ కళ్యాణ్ కాదు.. అతని స్నేహితుడిని అంటూ చెప్పగా షో లో ఉన్నవారంతా ఈలలు వేస్తూ కాసేపు హంగామా సృష్టించారు. అక్కడే ఉన్న యాంకర్ భాను శ్రీ మధ్యలో మాట్లాడుతూ ఆలీ గారు ప్లీజ్ దావత్ ఇవ్వరా అని కొంటెగా అడగింది. అందుకు బదులుగా సరే వచ్చేసేయ్ మా ఇంటికి అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు ఆలీ. ప్రోమో అంత కామెడీ, పంచ్ డైలాగ్స్ తో నిండి ఉన్న ఈ వీడియో ఇప్పుడు యుట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp