Conductor Jhansi : ఒకే ఒక్క పర్‌ఫార్మెన్స్‌తో ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారుతుండడం మనం చ చూస్తూనే ఉన్నాం. అలా పల్సర్ బైక్ సాంగ్‌కి రెచ్చిపోయి డ్యాన్స్ చేసి అందరి మనసులు గెలుచుకున్నారు ఝాన్సీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్‌లో పల్సర్ బండి పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయింది. కండక్టర్ నుండి ఇప్పుడు సెలబ్రిటీగా మారిన ఈమె రియల్ లైఫ్ అందరికి కన్నీళ్లు పెట్టిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో వేసిన డాన్స్ పై కొందరు విమర్శకులు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె భర్తను కూడా సోషల్ మీడియాలోకి లాగుతూ బూతు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె బాధపడుతూ ఎమోషనల్ వీడియో చేసింది. మంచి అవకాశం రావడంతో నాలోని టాలెంట్ బయట పెట్టడానికి ఆ షో కి వెళ్లాను . డ్యాన్న్స్ చేశాను. చాలామంది నన్ను పొగుడుతున్నారు థాంక్స్.. కానీ కొందరు మాత్రం మా వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఆపేయండి . నాలోని టాలెంట్ చూసి మా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు . దాన్ని మీరు నాశనం చేయకండి. ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు .మా ఆయనను ట్రోల్ చేయడం ఆపేయండి.
మా ఆయనను తిట్టడం ఆపేయండి” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇక తాను డాన్స్ చేసేందుకు పల్లెటూర్లకు వెళ్లిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసిందనేది కూడా ఝాన్సీ తెలియజేసింది. డాన్స్ చేయడానికి ముందు డాన్స్ చేసిన తర్వాత కనీసం డ్రెస్సులు మార్చుకునేందుకు కూడా ఇంట్లోకి రానిచ్చేవారు కాదని, దాంతో మేము ఒక ప్రత్యేకమైన టెంట్ రూముని ఏర్పాటు చేసుకొని స్టేజి వెనకాల డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్లమని ఝాన్సీ పేర్కొంది. ఆ టెంట్ రూమ్ ని తాము కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తే అక్కడికి తీసుకు వెళ్తామని చెప్పుకొచ్చింది. తమను ఇంట్లోకి రానివ్వడం వల్ల పరువు పోతుంది అనే భావన కలిగి ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.