Conductor Jhansi : కండక్టర్ ఝాన్సీ.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం నిర్వహిస్తూనే వందల కొద్ది రికార్డింగ్ డాన్సు పర్ఫార్మెన్స్ లు చేసి స్టేజ్ పై ఒక స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ఝాన్సీ.. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా స్టార్ గా మారిపోయింది. ఇప్పుడు ఆమె పల్సర్ బండికి వేసిన డాన్స్ సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కండక్టర్ ఝాన్సీ ఈ స్థాయిలో డాన్స్ వేయడంను కొంత మంది అభినందిస్తుంటే మరి కొద్ది మంది మాత్రం మరి ఇంత నీచంగా డాన్స్ వేయడమేంటి.. ఇద్దరు పిల్లల తల్లి ఇలాగేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఆమెకు ఎప్పుడూ ఉండేవే.. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన తర్వాత ఒక స్థాయిని మించి మరి ఆమెని ట్రోల్ చేస్తున్నవారు ఉన్నారు. మరి దారుణంగా ఆమె భర్తని నీచంగా మాట్లాడుతున్నారు.
ఆమె భర్త ఝాన్సీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఝాన్సీ యొక్క ప్రతిభని చూసి అతడు ప్రోత్సహించి, ఆమె వెంట నడుస్తున్నాడు. అలాంటి వ్యక్తిని గౌరవించి అభినందించాల్సింది పోయి భార్యతో అలాంటి పనులు చేయిస్తావా అంటూ ఇష్టానుసారంగా కొందరు బూతులు తిడుతూ అతన్ని ట్రోల్స్ చేస్తున్నారు. తన భర్తని ట్రోల్స్ చేయడం పట్ల కండక్టర్ ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. తన భర్త ఎంతో గొప్ప వ్యక్తి అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఎన్నో కార్యక్రమాల్లో ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి తన భర్త గురించి ఎంతో నీచంగా కొందరు మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో నా భర్త గురించి నీచంగా కామెంట్స్ చేస్తూ ఉంటే చనిపోవాలని అంత బాధగా ఉంది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలాంటి కామెంట్స్ వస్తే నా భర్త నన్ను ఎలా బయటికి వెళ్ళనిస్తాడు.. నాపై ఇన్నాళ్లు ఎంతో ప్రేమగా నమ్మకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నన్ను ఒకరకంగా చూడడా అంటూ కండక్టర్ ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆవేదనలో అర్థం ఉంది.. నిజంగానే కండక్టర్ ఝాన్సీ భర్త గొప్ప వ్యక్తి… అతని వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్థం చేసుకొని కొందరు అతడిని చేత కాని వాడని.. కొందరు అతడిని భార్య సంపాదనతో బతికేస్తున్నాడని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ అతడు మద్దతు వల్లే ఝాన్సీ ఈ స్థాయిలో ఉంది అనే విషయాన్ని మాత్రం వారు గుర్తించడం లేదు. అయినా అలాంటి తక్కువ ఆలోచన ఉన్నవాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు ఝాన్సీ అంటూ కొందరు ఆమెను సమర్థిస్తూ ఆమె భర్తనే అభినందిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.