
krishnam raju daughters marriage responsibility taken by prabhas
Prabhas : టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి ఇండస్ట్రీ మొత్తానికి కూడా తీరని లోటు.. ఇక ఆయన కుటుంబానికి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కూడా కాలేదు. కూతురు పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే కృష్ణంరాజు కు అనారోగ్య సమస్యలు తలెత్తడం జరిగిందట. ఆ అనారోగ్య సమస్యల నుండి బయట పడ్డ తర్వాత కృష్ణంరాజు తన పెద్ద కుమార్తె వివాహం చేయాలని భావించాడు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తెలిసినట్టు కృష్ణంరాజు కూతురు పెళ్లి చూడాలని ఆశ పడితే మరణం చూడాల్సి వచ్చింది. కృష్ణంరాజు చనిపోవడంతో ఆయన కుటుంబ బాధ్యత ప్రభాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణంరాజు ఆస్తులు సంపాదన విషయంలో ఎక్కడా కూడా తగ్గలేదు.
కృష్ణంరాజు దాదాపుగా వందల కోట్ల ఆస్తులను కుటుంబం కోసం సంపాదించాడు. కానీ కుటుంబ పెద్ద లేకుండా కుటుంబ ఆస్తులు ఎన్ని ఉన్నా కూడా వృధ అనేది టాక్. అందుకే ఇప్పుడు ఆ కుటుంబ బాధ్యతను ప్రభాస్ తీసుకోవాలని కృష్ణంరాజు అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ కూడా అందుకు సిద్ధమే అన్నట్లుగా ఉన్నాడు. పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన సమయంలో ఆయన భార్య వద్దకు వెళ్లి చెల్లెళ్ల యొక్క పెళ్లి బాధ్యత నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చాడట. తప్పకుండా మంచి సంబంధాలతో వారికి పెళ్లి చేసే బాధ్యతని ప్రభాస్ కుటుంబ సభ్యులు తీసుకుంటాం అన్నట్లుగా మొత్తం కుటుంబం హామీ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
krishnam raju daughters marriage responsibility taken by prabhas
ప్రభాస్ ఈ స్థాయికి రావడానికి కారణం కృష్ణంరాజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు కొడుకుని లేని కారణంగా తన నట వారసుడిగా ప్రభాస్ ని ఇండస్ట్రీకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను హీరోగా నటింపజేసి వరుసగా సక్సెస్ లు వచ్చేలా మంచి కథలను ఎంపిక చేసి మరి ప్రభాస్ ని స్టార్ గా నిలబెట్టిన ఘనుడు కృష్ణంరాజు. అందుకే ఇప్పుడు ఆయన కుటుంబ బాధ్యతలను స్వయంగా ప్రభాస్ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అది చాలా మంచి అభిప్రాయమని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ప్రభాస్ తన చెల్లెల పెళ్లి వైభవంగా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.