#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. ఏమాత్రం వీక్ మైండ్ ఉన్నా ఇక అంతే.. వచ్చిన వారంలోనే బయటికి వెళ్లిపోవాల్సిందే. కొందరు స్ట్రాంగ్ మైండ్ తో వచ్చినా.. లోపలికి వచ్చాక వీక్ అయిపోతారు. అలా చాలామంది ఎన్నో ఊహించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి చివరకు ఏం చేయలేక ఒకటి రెండు వారాల్లోనే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఒక రతిక కావచ్చు.. దామిని కావచ్చు.. శుభశ్రీ కావచ్చు.. మొన్న ఎలిమినేట్ అయిన నయని పావని కావచ్చు. వీళ్లంతా స్ట్రాంగ్ ప్లేయర్లే కానీ.. ప్రేక్షకుల మనసును గెలుచుకోలేకపోయారు. ప్రేక్షకుల మనసును గెలుచుకున్న వాళ్లే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా కాలం ఉండగలుగుతారు.
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో విలేజర్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో కూడా కంటెస్టెంట్లు ఇరగదీశారు. అంటే.. ఇది ఒకరకంగా కెప్టెన్సీ టాస్క్ అని చెప్పుకోవచ్చు. శోభ, తేజ ఇద్దరూ విడాకులు తీసుకున్న జంటగా నటించి ఇరగదీశారు. అమర్ దీప్ ఊళ్లోవారందరి గాసిప్స్ చేసే టీ షాప్ అని చెబుతాడు. టాస్క్ లో భాగంగా అమర్ దీప్ కింద కూర్చొని శోభా శెట్టి కాళ్లు పడుతాడు. ఇక.. యావర్ పల్లెటూరు పిల్ల కోసం వచ్చిన ఎన్ఆర్ఐగా నటించాడు. నేను పెళ్లి కోసం వచ్చాను అని చెబుతాడు యావర్. ఆ తర్వాత అర్జున్.. అశ్వినిని పటాయిస్తుంటాడు.
#image_title
ఏంటి ఊరును ఒక ఊపు ఊపేస్తున్నావట అంటూ శివాజీ.. అశ్వినిని అడగడం.. దీంతో ఇంత అందగత్తెను మరి.. ఆ మాత్రం ఊపనేంటి అంటుంది అశ్విని. నీ అందం చూద్దాం.. తోటకురా ఒకసారి అంటూ శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. కిళ్లీ కొట్టు వ్యక్తిలా నటించిన ఆట సందీప్.. ఓ పెద్దాయన లేతాకు కదా జాగ్రత్త అంటాడు. దీంతో ఆకు ఏదైనా ఆకే కదరా.. మనం సున్నం రాత్తా అంతే అంటూ అక్కడి నుంచి వెళ్తాడు శివాజీ. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో ఫుల్ టు ఫన్ ఉండబోతుందన్నమాట. దానికి సంబంధించిన ప్రోమోలను మీరు కూడా చూసేయండి మరి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.