Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్.. ప్రోమోతో అందరిలో సస్పెన్స్
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ రోజు సెప్టెంబర్ 7, సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల అయింది. నాగార్జున హోస్ట్‌గా మరోసారి అందరినీ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 2 నిమిషాల 29 సెకన్ల నిడివి గల ఈ ప్రోమోలో షో గొప్పదనాన్ని, కొత్త కాన్సెప్ట్‌ను చాటిచెబుతూ సాగింది.

#image_title
ప్రోమో అదుర్స్
“ఊహకందని మార్పులు… ఊహించని మలుపులు… డబుల్ హౌస్‌తో, డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9” అంటూ నాగార్జున స్టైలిష్ వాయిస్ ఓవర్ తో ప్రోమో ప్రారంభమవుతుంది. నాగార్జున ఓ క్లాసీ సూట్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవుతూ కనిపించగా, ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ హౌస్ సెటప్ రిచ్ లుక్ తో మరో లెవెల్‌లో ఉందనే చెప్పాలి.
ప్రోమోలో ఓ మేల్ కంటెస్టెంట్ తనతో ఒక బాక్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. నాగార్జున “బాక్స్ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందా?” అని అడగగా, ఆ కంటెస్టెంట్ “ఇది నా బాడీలో భాగం… అనుమతించండి” అని అడుగుతాడు. కానీ బిగ్ బాస్ అనుమతించకపోవడంతో, “అయితే నేను ఇంటికి వెళ్తాను” అంటూ స్వయంగా హౌస్‌లోకి రాకుండానే ఎలిమినేట్ అవుతాడు.ఈ ట్విస్ట్ ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగార్జున, కామన్ పీపుల్ కంటెస్టెంట్స్ అయిన కల్కి, దాలియాలు తో చేసిన సరదా సందడి ప్రేక్షకులకు నవ్వులు తెప్పించాయి.