David warnar : డేవిడ్ వార్నర్‌ను పూనిన ‘పుష్పరాజ్’.. కోహ్లీ, అల్లు అర్జున్ ఏమన్నారంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

David warnar : డేవిడ్ వార్నర్‌ను పూనిన ‘పుష్పరాజ్’.. కోహ్లీ, అల్లు అర్జున్ ఏమన్నారంటే?

David warnar : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ అభిమానులకు చాలా క్లోజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కడే జట్టును విజయతీరాలకు చేర్చేందుకు చాలా కష్టపడేవాడు. వార్నర్‌కు హైదరాబాద్ జట్టు అన్న.. హైదరాబాద్ బిర్యానీ అన్న ఇక్కడి అభిమానులు అన్న ఎంతో ఇష్టమంట.. అంతేకాకుండా మనోడు తెలుగు సినిమాల్లో వచ్చే సాంగ్స్‌కు తన దైన స్టైల్లో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :12 December 2021,5:00 pm

David warnar : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ అభిమానులకు చాలా క్లోజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీం చాలా పటిష్టంగా ఉంది. ఒక్కడే జట్టును విజయతీరాలకు చేర్చేందుకు చాలా కష్టపడేవాడు. వార్నర్‌కు హైదరాబాద్ జట్టు అన్న.. హైదరాబాద్ బిర్యానీ అన్న ఇక్కడి అభిమానులు అన్న ఎంతో ఇష్టమంట.. అంతేకాకుండా మనోడు తెలుగు సినిమాల్లో వచ్చే సాంగ్స్‌కు తన దైన స్టైల్లో స్టెప్టులు కూడా వేసి ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. గతంలో డేవిడ్ వార్నర్ అల వైకుంఠ పురంలో మూవీలోని బుట్టబొమ్మ పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించాడు ఈ లెఫ్ట్ హ్యాండర్ హిట్టర్.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీలో ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్‌లో అల్లు అర్జున్ ఫేస్ మార్పింగ్ చేసి తన ఫేస్‌ను యాడ్ చేశాడు.

David warnar : డేవిడ్ వార్నర్ పుష్ప పూనకం..

cricketer david warner becomes pushparaj

cricketer david warner becomes pushparaj

ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు. పుష్పరాజ్‌గా అవతారం ఎత్తిన డేవిడ్ వార్నర్ వీడియోను ఏకంగా 2 మిలియన్ పీపుల్ వీక్షించారు. లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అయితే, ఈ వీడియోను వీక్షించిన విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్‌లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ‘ఆర్ యూ ఓకే’ అని విరాట్ కోహ్లీ మెసేజ్ పోస్ట్ చేయగా.. దానికి ‘గొంతు ప‌ట్టేసిన‌ట్లుంది’ అంటూ వార్నర్ సరదాగా రిప్లై ఇచ్చారు. అదే విధంగా పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ ‘వార్న‌ర్ బ్ర‌ద‌ర్ త‌గ్గేదే లే’ అంటూ కామెంట్ పెట్టాడు.

ఏకంగా వార్నర్ సెలెబ్రిటీలతోనే మెప్పు పొందేలా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్‌’ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా డిసెంబర్ 17న విడుదలకు సిద్దంగా ఉంది. దీనిని తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఒకేసారి అనువాదం చేశారు. పుష్ప మూవీ విడుదలకు ముందే రూ.250 కోట్ల‌కు పైగానే బిజినెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది