Damini Eliminated : మూడో వారం దామిని ఔట్.. ఆమె ఎలిమినేషన్‌కి కారణాలు ఇవే

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 24, 2023, 7:00 pm

Damini Eliminated : మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయింది. ఆమె ఎలిమినేషన్ కు ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ.. అందరూ ముందే ఊహించినట్టుగానే దామిని ఎలిమినేట్ అయింది. మూడో వారం నామినేషన్స్ వేసినప్పటి నుంచి దామినీనే టార్గెట్ గా ఉంది. ప్రేక్షకులకు దామిని చేష్టలు కూడా నచ్చడం లేదు. నేను ఈ హౌస్ లో ఒక వంటలక్కగా మిగిలిపోయాను. ఇక నుంచి నేను వంట చేయను.. మీరే చేసుకోండి. ఎవరైనా చేసుకోండి. నాకు సంబంధం లేదు అన్నట్టుగా దామిని ఇంటి సభ్యులతో మాట్లాడింది.

damini eliminated third week from bigg boss telugu 7

#image_title

నిజానికి ఈ వారం హిట్ లిస్టులో దామినితో పాటు తేజ కూడా ఉన్నాడు. కానీ.. లాస్ట్ మినట్ లో తేజాను నామినేషన్స్ నుంచి ఆట సందీప్ సేవ్ చేస్తాడు. దీంతో తేజ ఈసారి నామినేషన్లను తప్పించుకోగా.. ఇక మిగిలింది దామినీనే. నిజానికి శుభశ్రీ, గౌతమ్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. కానీ.. వాళ్లకంటే కూడా దామిని ఇంకా డేంజర్ జోన్ లో ఉండటంతో ఇక ఈ వారం దామిని ఎలిమినేషన్ పక్కా అని అంతా అనుకున్నట్టుగానే జరిగింది.

Damini Eliminated : వచ్చే వారం గౌతమ్, శుభశ్రీ డేంజర్ జోన్ లో

ఈ వారం శుభశ్రీ, గౌతమ్ అయితే డేంజర్ జోన్ నుంచి తప్పించుకోగలిగారు. దామినిని ఇంట్లో నుంచి పంపించేశారు. వచ్చే వారం కూడా గౌతమ్, శుభశ్రీ ఇద్దరూ నామినేషన్స్ లోకి వస్తే మాత్రం వాళ్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. వీళ్లతో పాటు తేజ కూడా హిట్ లిస్టులో ఉన్నారు. అంటే ఈ ముగ్గురిలో ఒకరు నాలుగో వారంలో ఎలిమినేట్ కాబోతున్నారు. ఇక.. మూడో వారం దామిని ఎలిమినేట్ కావడంతో కొందరు ఇంటి సభ్యులు అయితే బోరున విలపించారు. మూడు వారాలే ఉన్నా ఇంట్లో వాళ్లందరికీ కమ్మని వంట మాత్రం వండి పెట్టింది దామిని. వంటలక్కగా పేరు తెచ్చుకుంది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp