Bigg Boss Telugu 7 : నేను హౌస్‌లో ఉంటే సీన్ వేరేలా ఉండేది.. మోనితకు వంటలక్క వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : నేను హౌస్‌లో ఉంటే సీన్ వేరేలా ఉండేది.. మోనితకు వంటలక్క వార్నింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :30 October 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  వంటలక్క బిగ్ బాస్ హౌస్ లోకి వస్తోందా?

  •  వంటలక్క వస్తే శోభా శెట్టి పరార్ అనాల్సిందే?

  •  మితిమీరుతున్న శోభా శెట్టి బిహేవియర్

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్న వాళ్లందరికీ తెలుసు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శోభా శెట్టి.. ఎలా ప్రవర్తిస్తుందో? తను నిజంగానే కార్తీక దీపం మోనితలా ప్రవర్తిస్తోంది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. అసలు.. మోనితలా ప్రవర్తించడం ఏంటి అని అనుకుంటున్నారు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. శోభా శెట్టి అసలు క్యారెక్టరే ఇది అన్నట్టుగా కనిపిస్తోంది. అవును.. మోనితలా మారిపోయి అచ్చం సీరియల్ లో మోనిత ఎలా ప్రవర్తించిందో.. బిగ్ బాస్ హౌస్ లో కూడా శోభా శెట్టి అలాగే ప్రవర్తించడంపై తెగ చర్చ నడుస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఇలాంటి ఘటనలు హౌస్ లో చాలా జరిగాయి. భోలే మీద అరవడం దగ్గర్నుంచి.. యావర్ మీద అరవడం.. ఏమైనా అంటే తేజ మీద అరవడం.. అసలు ఎవరు శోభను ఏదైనా అంటే చాలు.. వాళ్ల మీదికి గయ్యలిలా వెళ్లడం అందరూ చూస్తున్నారు. మోనిత క్యారెక్టర్ కంటే కూడా డేంజర్ గా ఉన్నావు అని అంటున్నారు జనాలు. శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు తన గురించి తెలుగు జనాలకు పెద్దగా తెలియదు. మోనితగా మాత్రమే తెలుసు కానీ.. తన అసలు వ్యక్తిత్వం ఏంటో తెలియదు.

కానీ.. ఎప్పుడైతే తను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందో.. తన ప్రవర్తనను బట్టి వాళ్లకు అర్థం అయిపోయింది. అందులోనూ తను ఓటమిని ఒప్పుకోదు. తను ఓడిపోవడం అస్సలు తనకు నచ్చదు. తనను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు తట్టుకోలేదు. గత రెండు వారాల నుంచి శోభా శెట్టి విపరీతంగా హైప్ అవుతోంది. ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతోంది. గత వారం తను నామినేట్ అవడంతో తను తట్టుకోలేకపోయింది. నిజానికి.. శోభాశెట్టి, సందీప్ ఈ ఇద్దరూ నామినేషన్లలోకి ఎప్పుడు వస్తే అప్పుడు ఎలిమినేట్ చేస్తామని ప్రేక్షకులు అంటున్నారు. ఈనేపథ్యంలో ఒక్కసారి సందీప్ మాస్టర్ నామినేషన్స్ లోకి వచ్చినా చాలు.. వెంటనే ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు. అలాగే.. శోభా శెట్టిని కూడా ఎలిమినేట్ చేస్తాం అన్నారు. అన్నట్టుగానే గత వారం శోభా శెట్టి, సందీప్ ఈ ఇద్దరికే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయట. శోభా శెట్టికి.. సందీప్ కంటే ఒక్క శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయట. అందుకే శోభా శెట్టి గత వారం సేవ్ అయింది కానీ.. ఈ వారం కూడా నామినేషన్స్ లోకి వస్తే ఖచ్చితంగా వెళ్లగొడుతాం అంటున్నారు.

Bigg Boss Telugu 7 : హౌస్ లో వంటలక్క ఉంటే ఎలా ఉండేది?

అయితే.. హౌస్ లో వంటలక్క ఉంటే బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. శోభా శెట్టిని ఒక ఆట ఆడుకునేది. శోభా శెట్టికి వంటలక్కే కరెక్ట్. కార్తీక దీపం సీరియల్ లోలా.. శోభా శెట్టికి వంటలక్క చుక్కలు చూపించేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది