Deepthi Sunaina : చీరకట్టులో తెగ హొయలు పోతున్న దీప్తి సునయన.. అందాల రచ్చ మాములుగా లేదు..!
Deepthi Sunaina : సోషల్ మీడియా, యూట్యూబ్‌తో ఫేమస్ అయిన సెలబ్స్ చాలా మందే ఉన్నారు. ఆ కోవలోకి వస్తుంది దీప్తి సునయన. ఈ అమ్మడు సోలోగా కన్నా కూడా షణ్ముఖ్‌తో ఎఫైర్ విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి. ఇందుకోసం సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. అభిమానులు, నెటిజన్లతో లైవ్ ముచ్చట్లు చెబుతోంది.
గత కొద్ది రోజులుగా దీప్తి సునయన విహార యాత్రలకి వెళుతూ అక్కడ ఫొటోలు, వీడియోలతో తెగ సందడి చేస్తంది. దీప్తి సునయన అందాల అరాచకాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో అందాలు ఆరబోస్తూ మెంటలెక్కిస్తుంది. కేరళలో బోటింగ్ సందర్భంగా దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో దీప్తి సునయన వెరీ క్యూట్ ప్లస్ హాట్ గా కనబడుతోంది. బ్లాక్ కలర్ శారీలో మల్టీకలర్ జాకెట్ ధరించి అలా నడుము అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది. అలా చీరలో హోయలు పోతూ , కొంటెగా చూస్తూ చూపులతోనే పిచ్చెక్కిస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

deepthi sunaina black saree looks viral
Deepthi Sunaina : చీరకట్టులో కేక పెట్టిస్తుందిగా..
బిగ్ బాస్ సీజన్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హగ్గులు, కిస్సులు వల్ల దీప్తి సునయన బాగా డిస్ట్రబ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉనన్ని రోజులు తనకు సపోర్ట్‌గానే నిలిచింది. తనకు బయట నుంచి మంచి ఓటింగ్ పడేలా తన వంతు కృషి చేసింది. అయితే షన్ను, సిరిల ఓవర్ యాక్షన్స్ ఆడియెన్స్‌కు నచ్చకపోవడంతో షణ్ముక్‌ను రన్నరప్‌గా నిలబెట్టారు. హౌస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన..షణ్ముక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ అందరూ షన్ను, దీప్తి సునయన విడిపోయారంటూ వార్తలు వినిపించాయి. అందరూ అనుకున్నట్లే షణ్ముక్‌తో విడిపోతున్నట్లు దీప్తి సుదీర్ఘమైన లేఖ ద్వారా చెప్పేసింది.