Deepthi Sunaina : దీప్తి సునయన డ్యాన్స్ రిహార్సల్స్.. యూట్యూబ్ బ్యూటీ కష్టం మాములుగా లేదు..!
Deepthi Sunaina : యూట్యూబర్ దీప్తి సునయన.. కొన్నాళ్లుగా షణ్ముఖ్‌తో కలిసి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. అతనికి బ్రేకప్ చెప్పడంతో సోలోగా సందడి చేస్తుంది. తన సోషల్ మీడయాలో వెరైటీ పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్‌కి వినోదం పంచుతుంది. దీప్తి సునయన ఏ పోస్ట్ పెట్టిన అది నిమిషాలలో వైరల్ అవుతుంటుంది. తాజాగా తన సోషల్ మీడియాలో డ్యాన్స్ రిహార్సల్‌కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అయితే బిగ్ బాస్ షో దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న షణ్ముఖ్-దీప్తి షణ్ముఖ్ లు విడిపోవడానికి కారణమైంది.
హౌస్ లో షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో నడిపిన ప్రేమాయణం ప్రేమ పక్షుల మధ్య చిచ్చు పెట్టింది. ఖచ్చితంగా ఇదే కారణం అంటూ షణ్ముఖ్, దీప్తి నోరు విప్పకపోయినా.. పరిణమాలు గమనిస్తే మాత్రం, అదే భావన కలుగుతుంది. షణ్ముఖ్ హౌస్ నుండి బయటికి వచ్చిన రోజుల వ్యవధిలోనే దీప్తితో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. బ్రేకప్ రూమర్స్ మొదలైన రోజుల వ్యవధిలో దీప్తి సునైన బ్రేకప్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకు విడిపోయారనేది వారి వ్యక్తిగత విషయం. బ్రేకప్ ప్రకటన తర్వాత ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో మాట్లాడారు దీప్తి.ఇకపై తన గురించి ఆలోచిస్తానని,
Deepthi Sunaina : దీప్తి రచ్చ..
సీరియస్ గా కెరీర్ పై ఫోకస్ చేస్తానని చెప్పారు. బిగ్ బాస్ షోకి వెళ్లబోయే ముందు షణ్ముఖ్-దీప్తితో కలిసి మలుపు పేరుతో ఒక సిరీస్ చేశారు. ఈ సిరీస్ లోని ఓ సాంగ్ మేకింగ్ వీడియో ఆ మధ్య యూట్యూబ్ లో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. ఆ వీడియో గమనిస్తే షణ్ముఖ్, దీప్తి షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేశారని అర్థమయింది. ఇక దీప్తి, షణ్ముఖ్ ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బ్రేకప్ బాధ నుండి బయటపడడం అంత సులభం కాదు. అయితే అదే తలచుకుంటూ కూర్చుంటే జీవితం ముందుకు నడవదు. ఈ విషయం బాగా తెలిసిన షణ్ముఖ్, దీప్తి తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. అలాగే వర్క్ లో ఇన్వాల్వ్ కావడం ద్వారా ఇలాంటి బాధలను మర్చిపోవచ్చు.
View this post on Instagram