Deepthi Sunaina : ఇప్పుడు క‌చ్చా బాదం టైం.. దీప్తి సున‌య‌న స్టెప్పుల‌కి కుర్రకారుకి పూన‌కం రావ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Published on: February 21, 2022, 12:00 pm

Deepthi Sunaina : ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పాట క‌చ్చా బాదం. ఈ పాట‌కి సామాన్యులు, సెల‌బ్రిటీలు తెగ డ్యాన్స్ లు వేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. కచ్చా బాదం పాట దాదాపు నెలకు పైగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట యూజర్లకు అర్ధం కాకపోయినప్పటికీ.. తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా ఇదే పాట‌కి యూట్యూబ్ స్టార్ దీప్తి సున‌య‌న త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చేసింది. త‌న గ్యాంగ్‌తో క‌లిసి దీప్తి చేసిన డ్యాన్స్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

దీప్తి స్టెప్స్ ఎంతో క్యూట్‌గా ఉన్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు.ప్ర‌స్తుతం దీప్తి వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.షణ్ముఖ్ తో విడిపోయిన తర్వాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ గా ఉంటూ చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు షేర్ చేస్తుంది.ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు..మొదట షణ్ముఖ్ తో యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న.బిగ్ బాస్ షో ద్వారా తన ఇమేజ్ బాగా పెరిగి పోయింది.ప్రస్తుతం వీరిద్దరూ విడిపోవడంతో దీప్తి -షణ్ముఖ్ ఇద్దరు మునుపటిలా కలిసి ఉండాలని వారి ఫాన్స్ కోరుకుంటున్నారు.

deepthi sunaina dance video viral

deepthi sunaina dance video viral

Deepthi Sunaina : దీప్తి ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా….

ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. పెళ్లి కూతురిలా ముస్తాబైన దీప్తి సునైనా ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నాయి. తన అందానికి దీప్తి సునైనా చిలిపిదనం జోడించి, తెగ ఉత్సాహ‌ప‌రుస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp