Deepthi Sunaina : డీజే టిల్లు సాంగ్‌కి అద్దిరిపోయే స్టెప్పులు వేసిన దీప్తి సున‌య‌న‌.. ఇది క‌దా మాస్ మ‌సాలా అంటే..!

Authored By Sam C | The Telugu News | Published on: February 18, 2022, 6:00 pm

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న‌.. ఈ పేరు చెబితే నెటిజ‌న్స్‌కి పూన‌కాలు రావ‌డం ఖాయం.ఈ అమ్మ‌డు ష‌ణ్ముఖ్‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేష‌న్స్ అన్నీ ఇన్నీ కావు. షణ్ముఖ్ అంటే విపరీతమైన ప్రేమను కనబరుస్తారు దీప్తి సున‌య‌న‌. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే ష‌ణ్ముఖ్‌.. దీప్తితో రొమాంటిక్ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా షణ్ముఖ్ ఫైనల్ కి చేరి చివ‌రికి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ షో త‌ర్వాత దీప్తి ష‌ణ్ముఖ్ మ‌ధ్య కాస్త గ్యాప్ ఏర్ప‌డింది. ఒక‌రంటే ఒక‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. అయితే ష‌ణ్ముఖ్ కి బ్రేక‌ప్ చెప్పిన త‌ర్వాత దీప్తి సున‌యన త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు షేర్ చేస్తుంది.

రీసెంట్‌గా దీప్తి సున‌య‌న త‌న సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. ఇందులో దీప్తి డీజే టిల్లు లోని సూప‌ర్ హిట్ సాంగ్‌కి చిందులు వేస్తూ క‌నిపించారు. ఇందులో దీప్తి క్యూట్ లుక్స్ మ‌తులు పోగొడుతున్నాయి. ఇది క‌దా దీప్తి అంటే అని ప‌లువురు కామెంట్స్ పెడుతున్నారు. యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి బిగ్ బాస్ షో క్రేజ్ ని మరింతగా పెంచింది. ఫోటో షూట్స్ లో క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో చిచ్చు పెట్టేస్తుంది. డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు అందుకొని బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. ఇక ఈ షో తర్వాత దీప్తి మరింత క్రేజ్ పెంచుకుంది.

deepthi sunaina dance with dj tillu song

deepthi sunaina dance with dj tillu song

Deepthi Sunaina : దీప్తినా మ‌జాకానా…

మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇతనితో లవ్ లో ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారాలు జరిగాయి. కానీ వీళ్లు స్నేహితులమని చెప్పుకొని తప్పుకునేవారు. ఇటీవలె ఓ కవర్ సాంగ్ కూడా చెయ్యగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 5 స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు ల‌వ‌ర్స్ అని అంద‌రు నిర్ణ‌యానికి రాగా, ఈ ఏడాది మొద‌ట్లో బ్రేక‌ప్ చెప్పుకొని షాక్ ఇచ్చారు. మరోవైపు దీప్తి సునయన సైతం బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఆమె బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా కొన్ని వారాలు హౌస్ లో ఉన్న విషయం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp