Deepthi Sunaina : వాటిని డిలీట్ చేశా!.. షన్నుని పూర్తిగా మరిచిపోయిన దీప్తి సునయన
Deepthi Sunaina : బిగ్ బాస్ షో దెబ్బకు ఓ జంట విడిపోయింది. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో షణ్ముఖ్ జశ్వంత్, సిరి హన్మంతులు చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫ్రెండ్స్‌కి ఎక్కువ పెళ్లాంకి తక్కువ అనేట్టు వీరి వ్యవహారం ఉండేది. ఒకే దుప్పట్లో దూరి పడుకునే వారు. ఒకే బెడ్డును షేర్ చేసుకునే వారు. ఇక ఒకే బెడ్డు మీద పడుకోవడం వద్దని షన్ను చెబితే.. సిరి అలిగిపోవడం అందరికీ తెలిసిందే.వీరి ముద్దులు, హగ్గులు అయితే ప్రతీ ఎపిసోడ్‌లో ఉండేవి.
అలా షన్ను, సిరిలు నానా హంగామా చేశారు. వీరి రిలేషన్ మీద జనాలకు అసహ్యం కలిగినట్టు అయింది. మొత్తానికి బయటకు వచ్చాక అసలు విషయం వారికి బోధపడినట్టుంది. మొత్తానికి షన్ను చేసిన నిర్వాకానికి దీప్తి సునయన భారీగానే మూల్యం చెల్లించినట్టు అయింది. బయటకు వచ్చిన షన్నుకి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది.షన్నుతో రిలేషన్‌ను తెంచుకుంటున్నాను అని చెప్పేసింది. దీప్తి సునయన సంతోషంగా ఉంటే చాలు అని షన్ను పోస్ట్ చేశాడు.

Deepthi Sunaina Deleted Pic WHich She Hated Most
కానీ షన్ను మాత్రం దీప్తిని ఇంకా కావాలనే అనుకుంటున్నాడు. తాజాగా దీప్తి సునయన తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఓ ప్రశ్న అడిగాడు. నువ్ అతిగా ద్వేషించే ఫోటో ఏది అని దీప్తి సునయను అడిగేశాడు.ఆల్రెడీ ఆ ఫోటోను డిలీట్ చేశాను అని దీప్తి సునయన చెప్పింది. అంటే అది షన్నుకి సంబంధించిన ఫోటోనే అయి ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. మొత్తానికి షన్నుని మాత్రం దీప్తి సునయన పూర్తిగా దూరం పెట్టేసినట్టు తెలుస్తోంది.

Deepthi Sunaina Deleted Pic WHich She Hated Most