Deepthi Sunaina : బీచ్‌లో తెగ సంద‌డి చేస్తున్న దీప్తి సున‌య‌న‌.. ష‌ణ్నుని పూర్తిగా మ‌ర‌చిపోయిందా ఏంటి?

Authored By Sam C | The Telugu News | Published on: April 9, 2022, 7:00 pm

Deepthi Sunaina : యూట్యూబర్ గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దీప్తి సునయన ఎన్నో వెబ్ సిరీస్ ల ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. సోలోగా క‌న్నా కూడా ష‌ణ్ముఖ్‌తో ఎఫైర్ విష‌యంలో ఎక్కువ‌గా హాట్ టాపిక్ అయింది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి.

గ‌త కొద్ది రోజులుగా దీప్తి సున‌య‌న విహార యాత్ర‌లకి వెళుతూ అక్క‌డ ఫొటోలు, వీడియోల‌తో తెగ సంద‌డి చేస్తంది. దీప్తి సున‌య‌న అందాల అరాచ‌కాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు. తాజాగా ఈ అమ్మ‌డు బీచ్ ప్రాంతానికి వెళ్లి అక్క‌డ తెగ సంద‌డి చేస్తుంది. బీచ్‌లో చిందులు వేస్తూ అటు తిరుగుతూ నానా హంగామా చేసింది. దీప్తికి సంబంధించిన వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌ల దీప్తి హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది . మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

deepthi sunaina enjoyment in peaks

deepthi sunaina enjoyment in peaks

Deepthi Sunaina : దీప్తి హంగామా అదుర్స్..

బిగ్ బాస్ సీజ‌న్ 5లో సిరితో షణ్ముక్ చేసిన హ‌గ్గులు, కిస్సులు వ‌ల్ల దీప్తి సునయ‌న బాగా డిస్ట్ర‌బ్ అయ్యింది. అయితే కూడా హౌస్‌లో ఉన‌న్ని రోజులు త‌న‌కు స‌పోర్ట్‌గానే నిలిచింది. త‌న‌కు బ‌య‌ట నుంచి మంచి ఓటింగ్ ప‌డేలా త‌న వంతు కృషి చేసింది. అయితే ష‌న్ను, సిరిల ఓవ‌ర్ యాక్ష‌న్స్ ఆడియెన్స్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ష‌ణ్ముక్‌ను ర‌న్న‌ర‌ప్‌గా నిల‌బెట్టారు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే దీప్తి సున‌య‌న..ష‌ణ్ముక్ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజ‌న్స్ అంద‌రూ షన్ను, దీప్తి సున‌య‌న విడిపోయారంటూ వార్త‌లు వినిపించాయి. అంద‌రూ అనుకున్న‌ట్లే ష‌ణ్ముక్‌తో విడిపోతున్న‌ట్లు దీప్తి సుదీర్ఘ‌మైన లేఖ ద్వారా చెప్పేసింది.

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp