Deepthi Sunaina : దీప్తి సునయన అస్సలు తగ్గట్లేదుగా.. ఆ ఊపుడేంది?
Deepthi Sunaina : యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన. ఈ అమ్మడు షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి చేసిన రచ్చ మామలుగా లేదు. ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కుతారని కూడా అందరు భావించారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్‌కి న్యూ ఇయర్‌లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అతని ప్రియురాలు దీప్తి సునయన. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.
అతని గెలుపుకోసం ఎంతో కష్టపడింది దీప్తి. అంతేకాదు.. అతని కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆర్ధికంగానూ హెల్ప్ చేస్తూ సపోర్ట్‌గా నిలిచింది. సన్నూ గెలుపునే తన గెలుపు అనుకుని అన్ని విషయాల్లో అతనికి తోడుగా నిలిచింది.ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కాని అతనికి బ్రేకప్ చెప్పి తెగ ఎంజాయ్ చేస్తుంది. పలు మ్యూజిక్ వీడియోలు చేస్తుంది. సోషల్ మీడియాలో తన అందచందాలతో అలరిస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మతెగ ఊపుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. దీప్తి సునయన జోష్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. షణ్ముఖ్‌ని మిస్ అయ్యామన్న బాధ ఈ అమ్మడికి ఏ మాత్రం కనబడడం లేదుగా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

deepthi sunaina enjoyment video viral
Deepthi Sunaina : దీప్తి సునయన ఫుల్ జోష్‌లో…
బ్రేకప్ తర్వాత దీప్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని షన్ను కూడా సింపుల్‌గా బ్రేకప్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే దీప్తి అంటే షన్నుకి ఇంకా ప్రేమ పోలేదనిపిస్తోంది. అప్పుడప్పుడు ఆమెను తలచుకుంటూనే ఉన్నాడు.అయితే షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయన చేసే ప్రతీ పని, పోస్ట్ మీద అందరూ దృష్టి పెడుతున్నారు. బిగ్ బాస్ షో షన్ను చేసిన వ్యవహారాల వల్లే బ్రేకప్ చెప్పి ఉంటుందా? లేదా ఇంకా ఏదైనా కారణాలున్నాయా? అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ స్టాలో ఇది వరకు షన్నుని ఫాలో అయ్యేది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను డీపీగా పెట్టుకునేది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తరువాత కథ అంతా మారింది.
View this post on Instagram