Shanmukh Jaswanth : ఆత్మహత్య ఆలోచనలు.. బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ సంచలన కామెంట్స్
Shanmukh Jaswanth : బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మనోడు వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంటాడు. ఒక వివాదం ముగిసింది అనుకునే లోపే, మరో వివాదంలో చిక్కుకుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షన్ను లైఫ్ పూర్తిగా టర్న్ అయ్యింది. దీప్తి సునయన బ్రేకప్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, డ్రగ్స్ కేసు ఇలా ఒకదాని తర్వాత మరోటి అతనిని చాలా ఇబ్బందులకి గురి చేశాయి. ఈ డిప్రెషన్ నుంచి అతడు బయటకి వచ్చినట్లు కనిపించడం లేదు. చాలా రోజులుగా సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్.. ఇన్ స్టాలో షాకింగ్ స్టోరీ పెట్టాడు. ఎన్నోసార్లు తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. కానీ చనిపోతే ఎవరు పట్టించుకోరంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
Shanmukh Jaswanth ఆత్మహత్య ఆలోచన వచ్చింది..
“నాకు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజులలో తీరిపోయే సమస్య కాదు.. చాలా కాలం సమయం తీసుకుంటుంది. అందుకు మనం కచ్చితంగా వెయిట్ చేయాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా కానీ.. ఒక్కసారి మనం సూసైడ్ చేసుకుంటే ప్రపంచంలో ఎవరూ పట్టించుకోరు. కేవలం ఫ్యామిలీ మాత్రమే బాధపడుతుంది. ప్లీజ్.. ఏదైనా సమస్యను ఎదుర్కొండి. దేవుడు కష్టాలను పెడుతూనే మనల్ని పరీక్షిస్తుంటాడు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొవాలి. అప్పుడు మనకు కావాల్సింది దొరుకుతుంది. నాకు ఉన్న అనుభవాలలో నేను అన్నింటిని అర్థం చేసుకున్నాను. అందుకే చెబుతున్నాను.. మీరు చాలా స్ట్రాంగ్.. మీరేదైనా చేయగలరు” అంటూ పోస్ట్ చేశాడు.

Shanmukh Jaswanth : ఆత్మహత్య ఆలోచనలు.. బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ సంచలన కామెంట్స్
ప్రస్తుతం అతడు చేసిన పోస్ట్, కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ ద్వారా యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ్.. ఇప్పుడు లీలా అనే వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి దీంతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.