Deepthi Sunaina : మంచు కొండ‌ల్లో దీప్తి సున‌య‌న స్టన్నింగ్ లుక్స్.. పెళ్లి కూతురు మాదిరి ఉందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi Sunaina : మంచు కొండ‌ల్లో దీప్తి సున‌య‌న స్టన్నింగ్ లుక్స్.. పెళ్లి కూతురు మాదిరి ఉందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 March 2022,10:00 pm

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సున‌య‌న‌.ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోలోను సంద‌డి చేసింది. ష‌ణ్ముఖ్‌తో ఎక్కువ క్లోజ్‌గాఉంటూ వార్త‌ల‌లోనిలిచిన ఈ అమ్మ‌డు అత‌డితో ప్రేమాయ‌ణం కూడా నడిపింది. ఆ విష‌యం అంద‌రికి తెలిసే స‌రికి బ్రేక‌ప్ కూడా జ‌రిగింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది దీప్తి సున‌య‌న‌. తోటి కంటెస్టెంట్ సిరితో హద్దులు దాటి ప్రవర్తించడంతో ష‌ణ్ముఖ్‌కి పూర్తి నెగెటివిటీ వచ్చింది. ఇమేజ్‌ సంగతి పక్కన పెడితే మొదటి నుంచి ప్రేమగా ఉంటున్న దీప్తి సునయన కూడా దూరమైంది.

అతనికి బ్రేకప్‌ చెబుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప‌లు రీల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌, మ్యూజిక్ వీడియోలు వంటివి చేస్తుంది. దీప్తి గ‌త కొద్ది రోజులుగా వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌ని సోష‌ల్ మీడియా ద్వారా అందిస్తూ వ‌స్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు తోటి ఆర్టిస్ట్‌తో క‌లిసి మంచు ప్రాంతంలో సంద‌డి చేసింది. ఇందులో ఇద్ద‌రు కూడా వ‌ధూవ‌రులు మాదిరిగా క‌నిపిస్తున్నారు. వీరిద్ద‌రిని చూసి అభిమానులు ప‌లు కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం దీప్తి షేర్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

deepthi sunaina enjoys in the snow

deepthi sunaina enjoys in the snow

Deepthi Sunaina : దీప్తికి బాధే లేదుగా..

కాగా బ్రేకప్‌ తర్వాత దీప్తి తన పనుల్లో తను బిజీగా మారిపోయింది. స్నేహితులను కలుస్తూ ఆ ఫొటోలను నెట్టింట్లో పంచకుంటోంది. షణ్ణూ మాత్రం దీప్తి మర్చిపోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు అతని ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు, పోస్టులే నిదర్శనం. నిత్యం తన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. వారిద్ద‌రు తిరిగి క‌లుస్తార‌ని అంద‌రు భావిస్తుండా, ఇప్ప‌ట్లో అది జ‌రిగేలా కనిపించ‌డం లేదు. అయితే దీప్తి కాని , ష‌ణ్ముఖ్ కాని సోష‌ల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్ అవుతుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది