Deepthi Sunaina : మెడ‌లో స్టెత‌స్కోప్ వేసుకొని దీప్తి సున‌యన‌ ర‌చ్చ‌… ఈ అమ్మ‌డు హంగామా మాములుగా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi Sunaina : మెడ‌లో స్టెత‌స్కోప్ వేసుకొని దీప్తి సున‌యన‌ ర‌చ్చ‌… ఈ అమ్మ‌డు హంగామా మాములుగా లేదుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :20 March 2022,2:30 pm

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న కుర్ర భామ దీప్తి సున‌య‌న‌. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఈ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ. సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

Deepthi Sunaina  : దీప్తి హంగామా మాములుగా లేదు..

బిగ్‌బాస్ 5వ సీజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ఏ స్థాయిలో వినోదాన్ని అందించిందో గానీ.. దీప్తి సునైనా, ష‌ణ్ముఖ్‌ల మ‌ధ్య ప్రేమ బంధాన్ని దూరం చేసింద‌ని చెప్ప‌డంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. హౌజ్‌లో సిరి, ష‌ణ్ముఖ్‌లు క్లోజ్‌గా ఉండ‌డంతోనే దీప్తి త‌మ బంధానికి గుడ్‌బై చెప్పింద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ష‌ణ్ముఖ్‌తో తాను విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది. అయితే దీప్తి ..హౌజ్‌లో ఉన్న‌ప్పుడు తనీష్‌తో చాలా స‌న్నిహితంగా మెలిగింద‌ని ఆమెపై కూడా కొంద‌రు కామెంట్స్ చేశారు. శ్రీ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఈ క్ర‌మంలో నేను బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన‌ప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పుడు నేను చిన్న‌దాన్ని. నాకు అప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ షో ద్వారా చాలా నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది దీప్తి.

deepthi sunaina enjoys with her co artist

deepthi sunaina enjoys with her co artist

గ‌త కొద్ది రోజులుగా దీప్తి ప‌లు వీడియోలు చేస్తుంది. వేరే న‌టుడితో క‌లిసి ఈ అమ్మ‌డు తెగ ర‌చ్చ చేస్తుండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా దీప్తి సున‌య‌న మెడ‌లో స్టెత‌స్కోప్ వేసుకొని ఓ న‌టుడితో తెగ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి సంద‌డి చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అంతేకాదు దీప్తి క్యూట్‌నెస్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది