Deepthi Sunaina : బీచ్ లో సంద‌డి చేసిన దీప్తి సునైనా.. ఇన్ స్టాలో వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: March 28, 2022, 11:00 am

Deepthi Sunaina : యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి సునైనా బిగ్ బాస్ షో ద్వారా మ‌రింత‌ క్రేజ్ ని పెంచుకుంది. ప్ర‌స్తుతం క్యూట్ లుక్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచడం పనిగా పెట్టుకుంది దీప్తి. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఈ అమ్మడు తెగ పాపులర్ అయింది. ఇటీవల‌ షణ్ముఖ్ జశ్వంత్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక, ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోన్న దీప్తి.. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే దీప్తి సునైనా..

యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని దీప్తి ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. దీంతో కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా..

Deepthi Sunaina latest Photos in Viral

Deepthi Sunaina latest Photos in Viral

Deepthi Sunaina : బిగ్ బాస్ షోతో..

ఈ న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. ‘నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ఎమోషనల్‌గా చెప్పేసింది.బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయని దీప్తి సునైనా.. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోంది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బీచ్లో సంద‌డి చేసిన‌ ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ల‌వ్ యూ.. బ్యూటిఫుల్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp