Hyper Aadi : హైపర్ ఆదికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. కట్నం ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : హైపర్ ఆదికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. కట్నం ఎంతో తెలుసా?

ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి సాధారణ కుటుంబం నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలలో తనదైన పంచులు వేస్తూ తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉండే ఆది అనూహ్యంగా జబర్దస్త్ టీం లీడర్ అదిరే అభి కంట పడటం.. అతడు తీసుకు వచ్చి ఆది కి తన టీంలో ఛాన్స్ ఇవ్వడం వంటివి అలా అలా కళ్ళ ముందు జరిగి పోయాయి. ఇప్పుడు కట్ చేస్తే ఆది […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 March 2022,10:00 am

ఒక చిన్న పల్లెటూరిలో పుట్టి సాధారణ కుటుంబం నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలలో తనదైన పంచులు వేస్తూ తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉండే ఆది అనూహ్యంగా జబర్దస్త్ టీం లీడర్ అదిరే అభి కంట పడటం.. అతడు తీసుకు వచ్చి ఆది కి తన టీంలో ఛాన్స్ ఇవ్వడం వంటివి అలా అలా కళ్ళ ముందు జరిగి పోయాయి. ఇప్పుడు కట్ చేస్తే ఆది కాస్త హైపర్ ఆది అయ్యాడు. ఇంజనీర్ అవ్వాల్సిన ఆది సూపర్ కమెడియన్ అయ్యాడు. మధ్య తరగతి కుటుంబం కాస్త ఉన్నత తరగతి కుటుంబం గా మారిపోయింది.

ఇదంతా కూడా జబర్దస్త్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు సినిమాల్లో చేస్తున్న హైపర్ ఆది పెళ్లి వయసు దగ్గర పడింది. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు అని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది పెళ్లి విషయంలో చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి.. ఆయనకు కోట్లకు కోట్లు కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయని తెలుస్తోంది.ఇటీవల హైపర్ ఆది సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి సంబంధం కలుసుకోవడానికి ఆది కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెళ్ళాడట.

Hyper Aadi marriage news

Hyper Aadi marriage news

ఆ సమయంలో హైపర్ ఆది కుటుంబ సభ్యులతో తన ఆస్తిలో సగభాగం ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడట. ఆయనకు దాదాపుగా రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల ఆస్తి ఉంటుందని స్థానికులు ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఆది ఇప్పటి వరకు ఏ ఒక్క పెళ్లి సంబంధానికి కూడా ఓకే చెప్పలేదు. మరో వైపు ఆయన ఎవరినైనా ప్రేమిస్తున్నారా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే ఆది పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది