Deepthi Sunaina : మంచు కొండల్లో దీప్తి సునయన ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదుగా..!
Deepthi Sunaina : షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి సునయనలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తుంది. వెబ్ సిరీస్‌లు,మ్యూజిక్ వీడియోస్, రీల్స్ ఇలా ఒకటేంటి, నానా రకాలుగా రచ్చ చేస్తుంది. దీప్తి సునయన రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మమంచు కొండలలో చీరకట్టుతో కనిపించి మెస్మరైజ్ చేసింది. దీప్తి సునయన క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు దీప్తి.. అసలు షణ్ముఖ్ నుండి విడిపోయిన బాధ కొద్దిగా కూడా కనిపించడం లేదుగా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
దీప్తి సునయన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.బిగ్‌బాస్ 2 సీజన్‌లో యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన చేసిన అల్లరిని మరిచిపోలేరు. ఈ సీజన్‌లో ఆమె చూపిన ఆటిట్యూడ్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాతో స్టార్ అయిన ఈ పిల్ల.. ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయేలా, తెలుగుదనం ఉట్టిపడేలా పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తున్నాయి. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.

deepthi sunaina latest Video Viral
Deepthi Sunaina : దీప్తి సునయన తెగ కవ్విస్తోందిగా..!
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. అయితే షణ్ముఖ్‌తో కలిసి పలు వీడియొలు చేస్తే చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కాని ఇప్పట్టో అది జరిగే సూచనలు అయితే కనిపించడం లేదు.
View this post on Instagram