Deepthi Sunaina : డీజే టిల్లు సాంగ్ కోసం దీప్తి సున‌య‌న ప‌డ్డ తంటాలు అంతా ఇంతా కాదు..!

Authored By Sam C | The Telugu News | Published on: February 27, 2022, 10:00 pm

Deepthi Sunaina : కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన విషయాల్లో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ న్యూస్ ఒకటి.దాదాపు ఐదు సంవ‌త్స‌ర‌ల పాటు ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట ప‌లు కార‌ణాల వ‌ల‌న విడిపోయారు. షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరుతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియుడితో విడిపోయిన తర్వాత దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది.ఇటీవ‌ల త‌న బ్యాచ్‌తో క‌లిసి తెగ డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేయ‌డం ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో కొద్ది నిమిషాల‌లోనే వైర‌ల్‌గా మారుతుంది.

ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. దీప్తి సున‌య‌న ఈ సాంగ్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డిందో వీడియోలో చూపించింది. ఆ వీడియోలో దీప్తి సున‌య‌న స్టెప్పులు వేయ‌డం, మ‌ధ్య‌లో ఆప‌డం వంటివి చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజ‌న్స్ ని ఆక‌ట్టుకుంటుంది.యూట్యూబ్‌లో, సిరీస్‌లో దీప్తి, ష‌ణ్ముఖ్ పెయిర్‌కి , కెమిస్ట్రికి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతేకాదు ఎంతో కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు.

deepthi sunaina reharsals for dj tillu song

deepthi sunaina reharsals for dj tillu song

Deepthi Sunaina : దీప్తి ర‌చ్చ మాములుగా లేదు..

అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్‌ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ తెగ కోరుకుంటున్నారు. షణ్మఖ్‌ తండ్రి మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఆ మధ్య ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశాడు. కానీ దీప్తి వాలకం చూస్తుంటే మళ్లీ ఆమె షణ్నుతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందంటూ వారి ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేయగా.. మరికొందరూ కలుస్తారు అంటూ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జ‌రిగింది. కాని ఆ రోజు కూడా గుడ్ న్యూస్ అంద‌లేదు.

Sam C

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp