Hyper Aadi Marriage : హైపర్ ఆదితో ఆ అమ్మాయి పెళ్లి.. ఎట్టకేలకి క్లారిటీ..!
ప్రధానాంశాలు:
Hyper Aadi Marriage : హైపర్ ఆదితో ఆ అమ్మాయి పెళ్లి.. ఎట్టకేలకి క్లారిటీ..!
Hyper Aadi Marriage : హైపర్ ఆది Hyper Aadi .. ఈ పేరు తెలియని, ఈయన పంచుల గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. గత పదేళ్లుగా జబర్దస్త్ షోలో jabardasth కమెడియన్ గా చేస్తూ అందరినీ నవ్విస్తున్న ఈయన కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్నారు. అయితే ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఈయన పెళ్లికి సంబంధించి నిత్యం పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. దీపు నాయుడు తో హైపర్ ఆది పెళ్ళంటూ గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి .

Hyper Aadi Marriage : హైపర్ ఆదితో ఆ అమ్మాయి పెళ్లి.. ఎట్టకేలకి క్లారిటీ..!
ఈ విషయం పైన దీపు నాయుడు Deepu Naidu క్లారిటీ ఇచ్చింది. హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని తాను సరదాగా తనని ఫ్లర్ట్ వంటివి చేస్తూ ఉంటానే తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తెలియజేసింది.హైపర్ ఆది తనకు ప్రొఫెషనల్ గానే పరిచయమయ్యారని తెలియజేసింది. గతంలో హైపర్ ఆది దీపునాయుడు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో స్కిట్ చేయడం జరిగింది. అప్పటినుంచి తమ మధ్య ఏదో ఉందన్నట్లు రూమర్స్ వినిపించాయని, ఒకానొక సందర్భంలో ఒక రీలు కూడా చేశాము.
ఆ సమయంలో హైపర్ ఆది తాను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదు నీకోసమే చేస్తున్నానంటూ చెప్పారు.. మొదట్లో హైపర్ ఆది తీరు కూడా తనకి నచ్చలేదని కానీ స్నేహితుడిగా మారిపోయారని తెలిపింది. ఇక దీపు నాయుడు జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొత్తానికి హైపర్ ఆది పెళ్లితో క్లారిటీ ఇచ్చేసింది దీపు నాయుడు.