Hyper Aadi : నామీదనే పంచులా.. ఫేక్ న్యూస్‌పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Hyper Adi : నామీదనే పంచులా.. ఫేక్ న్యూస్‌పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!
Hyper Aadi : మారుమూల గ్రామంలో పుట్టిన హైపర్ ఆది తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి చేరాడు. జబర్దస్త్ షో (Jabardast Show )తో పాపులర్ అయ్యిన ఆయన తర్వాత తెలుగు బుల్లితెరపై పలు చానెల్స్‌లో రకరకాల కార్యక్రమాలు, సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. నటుడిగా, రైటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తాజాగా “ఢీ 2” కార్యక్రమంలో పాల్గొన్న హైపర్ ఆది సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ పోస్టులు, దుష్ప్రచారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఢీ డ్యాన్స్ షో హోస్ట్‌గా ఉన్న సుడిగాలి సుధీర్ సినిమాలు, ఇతర షోలకు బిజీగా ఉండటం వలన షో నుంచి దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి సుధీర్ షోకి చేరడం వల్ల కంటెస్టెంట్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు…
Hyper Aadi : నామీదనే పంచులా.. ఫేక్ న్యూస్‌పై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!
Hyper Aadi : ఫ్యాన్స్ ప్రేమకు ధన్యవాదాలు
ఈటీవీ కమ్ టూ ఢీ పార్టీ అనే ప్రోమో విడుదల చేసి హైపర్ ఆది, సుధీర్ మధ్య బెస్ట్ ఎంటర్‌టైనర్ కోసం కాంపీటిషన్‌ను ప్రదర్శించింది. ఇందులో ఇంద్రజ మాట్లాడుతూ..మిమ్మల్ని జనాలు ఎందుకు ఇష్టపడతారో చూద్దాం అని ఓ వీడియో చూపించారు. ఆ వీడియోలో ప్రేక్షకులు ఆది, సుధీర్ అంటే ఏమనుకుంటారో వివరిస్తూ, వారి అభిప్రాయాలను పంచుకున్నారు. తర్వాత స్టేజ్‌పై వచ్చిన ఆది, సుధీర్ ఒకరికొకరు హత్తుకోవడం మరియు నా మీద చూపించే ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది జబర్దస్త్ ఫ్యామిలీ అని సుధీర్ చెప్పారు. హైపర్ ఆది సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్, ఫేక్ పోస్టులపై నాకు 95 శాతం పాజిటివ్ ఉంటుంది. 5 శాతం నెగటివ్ ఉంటే అది పెద్ద సమస్య కాదు అని వ్యాఖ్యానించారు. నేను సినిమాలు, షోలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ ఇచ్చినందున కొంత నెగటివ్ ఉంటుంది. అయినప్పటికీ సాధారణ ప్రజల వ్యూయర్‌షిప్ నాకు చాలా విలువైనవి.. వారు మా మంచి కంటెంట్‌ను చూసి ఆస్వాదిస్తారు. అలాంటి ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అని అది అన్నారు.
ఆది-సుధీర్ కలయికలో కొన్ని స్కిట్స్ స్క్రీన్‌పై ప్రదర్శించగా వారిద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఈవెంట్స్ నడిచిన రోజులలో షో 13, 14 రేటింగ్స్ సాధించడం ప్రత్యేక ఘట్టం అని ఆది తెలిపారు. ఢీ కొత్త సీజన్ ప్రారంభమైనప్పటికీ సుధీర్ బ్రదర్‌ని మరోసారి ట్రై చేయమని అడుగుతాను. ఢీ కింగ్‌డమ్‌లో ఆయన కోట నేను ఆయన తర్వాత జాయిన్ అయ్యాను. సుధీర్ యావత్తూ కింగ్ అని హైపర్ ఆది భావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆది-సుధీర్ ఫ్రెండ్షిప్ కొనసాగాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.