Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు… స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు… స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ

 Authored By ramu | The Telugu News | Updated on :25 November 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు... స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ విష‌యంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాత‌ల‌కి గొడ‌వ‌లు జ‌రిగిన‌ట్టు అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మ‌నం చూశాం. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపినప్పుడే అర్థమైపోయింది. సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ బాండింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విడదీయలేని బంధం వారిది. దేవి లేకపోతే సినిమా చేయలేను.. అని సుకుమారే చాలా వేదికలపై చెప్పాడు. పుష్ప-2 బాగ్రౌండ్‌ స్కోర్‌ కోసం దేవిని పక్కన పెట్టి తమన్‌, అజనీష్‌ లోక్‌నాథ్‌, శ్యామ్‌ సీఎస్‌లను తీసుకొచ్చారు మైత్రీ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్‌ సమయానికి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వలేదని, అందువల్ల మరో ముగ్గుర్ని తీసుకోవాల్సి వచ్చిందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Devi Sri Prasad పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ

Devi Sri Prasad : పుష్ప‌2 మ్యూజిక్ గొడ‌వ‌లు… స్టేజ్‌పై నుండే నిర్మాత‌ల‌కి చుర‌క‌లు అంటించిన దేవి శ్రీ

Devi Sri Prasad ఇదేంద‌య్యా దేవి..

ఈ నేపధ్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో స్టేజి మీద దేవి శ్రీ ప్రసాద్ ఓపెన్ అయ్యారు.’మనకు ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. నిర్మాత ఇచ్చే పారితోషికమైనా, తెరపై మన పనైనా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. చాలా మంది హీరోయిన్స్ డ్యాన్స్ చేసిన తొలి స్పెషల్ సాంగ్‌కు నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. ఈ క్రెడిట్ ఏ సంగీత దర్శకుడికీ లేదు’ అని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిని సంబోధిస్తూ .. ‘నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే .. నేను టైమ్‌కి పాట ఇవ్వలేదు. టైమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేదు. టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటారు.

మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మీకు నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటో అర్ధం కాదు. ఇప్పుడు కూడా నేను వచ్చి దాదాపు 20 – 25 నిమిషాలు అవుతుంది. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్ను ఆపారు. లోపలికి వెళ్తాను అంటే నన్ను లోపలికి పంపించలేదు. చివరకు కిస్సక్ పాట విని లోపలికి పరిగెత్తుకొచ్చాను. వచ్చినోడిని ‘రాంగ్ టైమింగ్ సార్ లేట్‌గా వచ్చారు’ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేను ఎప్పుడూ అన్ టైమ్ సర్ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. నిర్మాతలతో ఎంతైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ ఇలా బహిరంగంగా వేదికపై దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడటం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది