Sreeleela : శ్రీలీల వలన ధమాకా ఆడడం ఏంటి.. ప్రసన్నకుమార్ ఫైర్..!
ప్రధానాంశాలు:
Sreeleela : శ్రీలీల వలన ధమాకా ఆడడం ఏంటి.. ప్రసన్న కుమార్ ఫైర్..!
Sreeleela : మాస్ మహారాజ రవితేజ 2022 లో ధమాకా Dhamaka సినిమాతో చివరగా హిట్ కొట్టాడు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయి 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి రవితేజ కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ ఖాతాలో ఒక్క హిట్ లేదు. అయితే ఈ సినిమా హిట్‌కి శ్రీలీలనే కారణం అని కొందరు చెప్పుకొస్తున్నారు.

Sreeleela : శ్రీలీల వలన ధమాకా ఆడడం ఏంటి.. ప్రసన్న కుమార్ ఫైర్..!
దీనిపై రైటర్ ప్రసన్న కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ధమాకాలో కన్నా శ్రీలీల Sreeleela చాలా సినిమాలు ఇంత కన్నా బాగా చేశారు. పెద్ద హీరోలతో చేశారు. గ్లామరస్‌గా కూడా ఇంతక ముందు చేసింది. పాటల వలన సినిమాలు ఆడవు. కథ డ్రైవ్ చేయాలి తప్ప సినిమాని నిలబెట్టవు.
ఫైట్స్, పాటల వలన సినిమాలు హిట్ కావు. రెండు గంటలు కథ చెప్పకపోతే దారుణమైన ఫ్లాప్ అవుతాయి. శ్రీలీల వంద కోట్లు పట్టుకొచ్చిందనేది తప్పుడు ప్రచారం అని ప్రసన్న కుమార్ Prasanna Kumar స్పష్టం చేశారు. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా రావు రమేష్, మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ ముఖ్య పాత్రల్లో త్రినాథరావు తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ అయింది.