Sreemukhi : ఒంటరిగానే ఉంటున్నావా?.. శ్రీముఖిని కొంటెగా అడిగిన ధన్ రాజ్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 26 October 2021, 7:03 pm

Sreemukhi  శ్రీముఖి బుల్లితెరపై ఎంత స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే. తన బాడీ షేమింగ్, పర్సనల్ విషయాల మీద ఎంత మందిసెటైర్లు వేసినా కూడా లైట్‌గానే తీసుకుంటుంది. అలాంటి శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరపై కామెడీ స్టార్స్ అనే ఒక్క షోను మాత్రమ చేస్తోంది. ఇంతకు ముంద బొమ్మ అదిరింది అనే షోకు హోస్ట్‌గా ఉండేది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు శ్రీముఖి కామెడీ స్టార్స్ షోతో రచ్చ చేస్తోంది.

Dhan Raj Fun With Sreemukhi In Comedy Stars

Dhan Raj Fun With Sreemukhi In Comedy Stars

ఇందులో ఎప్పుడు ఎవరు ఉంటున్నారు.. ఎందుకు ఉంటున్నారు. ఎందుకు బయటకు వెళ్తున్నారు.. మళ్లీ ఎందుకు వస్తున్నారు? అనే విషయాలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి నిండుగా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అవినాష్, హరి టీంలు తప్పా ఇంకేం లేనట్టుగా అనిపిస్తుంది.సద్దాం ఒక్కడు కాస్త నెట్టుకొస్తున్నాడు. మొదట్లో చమ్మక్ చంద్ర బాగానే హల్చల్ చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ధన్ రాజ్, వేణు కూడా అంతే.

Sreemukhi  శ్రీముఖిపై దన్ రాజ్ కామెంట్స్

Dhan Raj Fun With Sreemukhi In Comedy Stars

Dhan Raj Fun With Sreemukhi In Comedy Stars

వారి ప్రయాణం ఎటో ఎటో మలుపులు తిరిగి ఎక్కడో ఆగుతుంది. ఎక్కడా కుదురుగా ఓ చోట ఉండరు. జబర్దస్త్ అంటారు.. మధ్యలో సినిమాలు అంటారు.. ఆ తరువాత అదిరింది బొమ్మ అదిరింది అన్నారు. ఇప్పుడు కామెడీ స్టార్స్ అంటున్నారు. అందులోనూ కనిపించడం మానేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కనిపించారు. వచ్చీ రాగానే శ్రీముఖి మీద పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది.. అని ఎంత కష్టం కదా? అని శ్రీముఖిని ధన్ రాజ్ కొంటెగా అడుగుతాడు. ఇంతకీ నువ్ ఒంటరిగానే ఉంటున్నావ్ కదా? అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp