Roja : రోజా మీద అరిచిన హైపర్ ఆది.. ఒక్కసారిగా అంతా షాక్
Roja అది జబర్దస్త్ షో అయినా ఎక్స్ ట్రా జబర్దస్త్ షో అయినా రోజా చెప్పిందే శాసనం. ఆ రెండు షోలకు శివగామిలాంటిది రోజా. అయితే హైపర్ ఆది వంటి వాడు అప్పుడప్పుడు రోజా మీదే కౌంటర్లు వేస్తుంటాడు. ఆమె ఎమ్మెల్యే పదవి, ఆమె రచ్చబండ షోలో, ఆమె మేకప్పులు అంటూ ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటాడు. కానీ రోజా మీద ఎప్పుడూ కూడా చిరాకు పడినట్టు కానీ కనిపించలేదు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో ఆది రోజా మీద అరిచేశాడు.

Hyper Aadi Fires On Roja In Thaggedele Event
దీపావళి సందర్భంగా ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. ఇందులో రోజా, పూర్ణ, ప్రియమణి, ఇంద్రజ, మన్నారో చోప్రా వంటి వారు వచ్చారు. అయితే పూర్ణ, ప్రియమణిలు చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు అందరూ షాక్ అవుతున్నారు. చూపే బంగారమాయేనే శ్రీవల్లి అంటూ పూర్ణ మెలికలు తిరిగింది. అది కూడా ప్రదీప్‌ను చూసి తెగ సిగ్గపడిపోయింది. అయితే ఈ ఈవెంట్‌లో సైగలతో పాటలను గుర్తు పట్టే ఆటను ఆడినట్టున్నారు. ఆట మధ్యలో రోజా మీద ఆది ఫైర్ అయ్యాడు.
Roja రోజా మీద ఆది ఫైర్

Hyper Aadi Fires On Roja In Thaggedele Event
అందులో భాగంగా ఆది ముందుకు వచ్చాడు. వెంకటేష్ సినిమాను గెస్ చేసేందుకు కొన్ని హింట్లు ఇచ్చాడు. వెంకటేష్‌లా డ్యాన్సుచేశాడు. అక్కడ ఇక్కడ అని చేతిని చూపించాడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని రామ్ ప్రసాద్ చెప్పేశాడు. అయితే రోజా మాత్రం కౌంటర్ వేసింది. అలా ఇలా చేతులు ఊపితే చెప్పినట్టా? మాలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడా?అని ఆది మీదరోజా కౌంటర్లు వేసింది. హే ఊరుకో అంటూ రోజా మీద ఆది విరుచుకపడ్డాడు. మీరు చేసింది ఎక్స్ ప్రెషన్సా? నేను ఇంత చేస్తే అది కాదా? అని కౌంటర్ వేశాడు.
