Dhanush Aishwarya : ధనుష్ ఐశ్వర్య విడాకులపై గుడ్ న్యూస్ చెప్పిన ధనుష్ తండ్రి..!
Dhanush Aishwarya :18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ధనుష్ ఐశ్వర్య జంట ఇటీవల విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నఈ జంట ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చింది. ధనుష్ కస్తూరిరాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి విడుదలైన ‘కాదల్ కొండెన్’ అనే సినిమా కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
గత కొద్ది రోజులుగా ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ డివోర్స్‌కి కారణాలేంటి? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు విడిపోతున్నారనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి కస్తూరి రాజా రియాక్ట్ అయ్యారు. ఓ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కస్తూరి రాజా. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణమైన విషయం. అలాంటి మనస్పర్థలే ధనుష్, ఐశ్వర్య మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారని అన్నాడు.

dhanush Aishwarya father gives good news to fans
Dhanush Aishwarya : వాళ్లు త్వరలోనే కలుస్తారు…
విడాకుల విషయం గురించి ఇద్దరితో చర్చించాను. నా వంతు సూచనలు ఇచ్చాను. రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయంపై మరోసారి ఆలోచించమని వారిద్దరిని కోరారు. మరోవైపు పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కోరుతున్నారని కస్తూరి రాజా అన్నారు.కాగా 2004లో పెద్దల అనుమతితో ఏడడుగులు నడిచిన ధనుష్, ఐశ్వర్యలకు లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులున్నారు. ఈక్రమంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ లవ్లీ కపుల్ హఠాత్తుగా బ్రేకప్ చెప్పేసి అభిమానులతో పాటు సినీ ప్రియులకు షాక్ ఇచ్చారు.