Dhee Choreographer Chaitanya Master : ఢీ ప్రోగ్రాం కోరియోగ్రాఫర్ చావు వెనక దారుణ నిజం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhee Choreographer Chaitanya Master : ఢీ ప్రోగ్రాం కోరియోగ్రాఫర్ చావు వెనక దారుణ నిజం..!

Dhee Choreographer Master Chaitanya : టీవీల్లో నటించే వాళ్లు, కనిపించే వాళ్ల లైఫ్ స్వర్గం అని, వాళ్లకు చాలా డబ్బులు ఉంటాయని అంతా అనుకుంటారు కానీ.. కనిపించేదంతా నిజం కాదు అని ఈ ఘటనతో తేలిపోయింది. అవును.. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఢీ కొరియోగ్రాఫర్ మాస్టర్ చైతన్య గురించి. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొని చివరకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. రిచ్ లైఫ్ కు అలవాటు పడే చాలా మంది సెలబ్రిటీలు అప్పుల మీద […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 May 2023,7:00 pm

Dhee Choreographer Master Chaitanya : టీవీల్లో నటించే వాళ్లు, కనిపించే వాళ్ల లైఫ్ స్వర్గం అని, వాళ్లకు చాలా డబ్బులు ఉంటాయని అంతా అనుకుంటారు కానీ.. కనిపించేదంతా నిజం కాదు అని ఈ ఘటనతో తేలిపోయింది. అవును.. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఢీ కొరియోగ్రాఫర్ మాస్టర్ చైతన్య గురించి. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొని చివరకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. రిచ్ లైఫ్ కు అలవాటు పడే చాలా మంది సెలబ్రిటీలు అప్పుల మీద అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

Dhee Choreographer Chaitanya Master commits suicide

Dhee Choreographer Chaitanya Master commits suicide

నెల్లూరులోని క్లబ్ హోటల్ లో చైతన్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తను చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు అప్పులు ఎక్కువయ్యాయని.. వాటిని తీర్చలేకపోతున్నానని.. ఇక ఇదే తనకు చివరి రోజు అని.. అందరినీ బాధపెడుతున్నందుకు క్షమించండి.. ఈ వీడియో తర్వాత తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. నాకు ఉన్న అప్పులను తీర్చడానికి చాలా ప్రయత్నాలు చేశా. కానీ నాకు వస్తున్న పారితోషికంతో అప్పులను తీర్చలేను.

Dhee Dance Master Chaitanya Dead, Chaitanya Master Latest News - NAYAG News

Dhee Choreographer Master Chaitanya : ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పు తీరడం లేదు

అది సాధ్యం కాదు కాబట్టే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా. నా దగ్గర సాయం పొందిన చాలామంది నాకు సాయం చేశారు.. అంటూ సూసైడ్ వీడియోలో చైతన్య చెప్పుకొచ్చాడు. చైతన్య ఆత్మహత్యపై ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఢీ షో నిర్వాహకులు, జడ్జిలు, ఇతర కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్ షాక్ అయ్యారు. ఎన్నో కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి, పలు కార్యక్రమాల్లో సందడి చేసిన చైతన్య.. ఇంత సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం దారుణం అని ఆందోళన వ్యక్తం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది