Hyper Aadi : హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్ కి బ్రేక్ తీసుకోబోతున్నాడా? ఈసారి పూర్తిగా..!
Hyper Aadi : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి మళ్లీ కష్టాలు మొదలవబోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హైపర్ ఆది షో కి గుడ్ బై చెప్పేందుకు మల్లెమాల వారితో చర్చలు జరుపుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలోని హైపర్ ఆది జబర్దస్త్ నుండి వెళ్లి పోయాడు. స్కిట్స్ రాసుకోవడం మరియు వాటిని చేయడం ఎక్కువ టైం పడుతుందని, అందుకే జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాను అంటూ ఆ మధ్య హైపర్ ఆది పేర్కొన్నాడు. ఇతర చానల్స్ నుండి పెద్ద ఎత్తున ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆది ఇప్పటి వరకు ఏ ఒక్క ఛానల్ కి ఓకే చెప్పలేదు.
అప్పుడప్పుడు గెస్ట్ గా వెళ్లి పలకరించి వస్తున్నాడు తప్పితే ఇప్పటి వరకు పర్మినెంట్ గా ఏ ఒక్క ఛానల్ కి వెళ్ళలేదు. అయినా కూడా ఆయన కోసం చానల్స్ వారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. గతంలో ఈటీవీ మల్లెమాల జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లి పోయిన వారి పరిస్థితి ఏంటో హైపర్ ఆది ప్రత్యక్షంగా చూస్తున్నాడు. కనుక జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లి వేరే చోట సక్సెస్ అవ్వాలనే ఆశ హైపర్ ఆదికి లేదు. కానీ ఆయనకు ఇతర కమిట్మెంట్స్ వల్ల జబర్దస్త్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నాడు. ముఖ్యంగా సినిమాలు చేయడంతో ఆయన బిజీ అయ్యాడు. అందుకే ఇక మీదట జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉండాలి అనే నిర్ణయానికి వచ్చినాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
గతంలో మాదిరిగా కొన్ని నెలల తర్వాత జబర్దస్త్ లో హైపర్ ఆది రీ ఎంట్రీ ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి జబర్దస్త్ కి దూరం అయితే హైపర్ ఆది మళ్ళీ రావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కనుక అది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కి జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు పూర్తి కాబోతుంది. కనుక ఆ సమయం వరకి హైపర్ ఆది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కఠిన నిర్ణయం తీసుకోబోతున్నాడు అంటూ మల్లెమాల వర్గాల నుండి సమాచారం అందుతుంది.