Rashmi Gautam : రష్మీ గౌతమ్‌ బోర్ కొట్టిందా? రెమ్యూనరేషన్‌ ఇవ్వలేక మల్లెమాల వారి కక్కుర్తి..!!

Advertisement

Rashmi Gautam : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఒకప్పుడు మల్లెమాల వారికి మరియు ఈటీవీ వారికి భారీ ఎత్తున ఆదాయం లాభం దక్కేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. జబర్దస్త్ కార్యక్రమం గతంతో పోలిస్తే దారుణమైన రేటింగ్ నమోదు చేస్తూ ఉంది. అందుకే జబర్దస్త్ ద్వారా ఆదాయం అనేది దాదాపు 30 శాతానికి పడి పోయింది. అందుకే మల్లెమాల వారు ఆదాయానికి తగ్గట్లుగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో చాలా మందిని తప్పిస్తున్నారు. హైపర్ ఆదికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఉద్దేశంతో ఆయన్ని తప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక యాంకర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న

Advertisement
is Rashmi Gautam going out from jabardasth and mallemala tv
is Rashmi Gautam going out from jabardasth and mallemala tv

రష్మి గౌతమ్ ని కూడా తొలగించే ఉద్దేశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఎక్కువ రెమ్యూనరేషన్‌ డిమాండ్ చేస్తున్నాడు అంటూ సింగర్ మనో ని జడ్జ్‌ స్థానం నుండి తప్పించారట. అలాగే పోసాని కృష్ణ మురళి కూడా అలాగే తప్పుకున్నారు. ఇప్పుడు రష్మి గౌతమ్ కూడా తక్కు రెమ్యూనరేషన్ తో తప్పుకోవాల్సి వస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో పది సంవత్సరాల నుండి రష్మి గౌతమ్ జబర్దస్త్ కార్యక్రమాన్ని చేస్తుంది కనుక ప్రేక్షకులకు ఆమె బోర్ కొట్టిందని.. అందుకే ఆమెను తప్పించి కొత్త యాంకర్ ని తీసుకు రావాలని భావిస్తున్నామంటూ మల్లెమాల వారు బయట ప్రచారం చేస్తున్నారట.

Advertisement
is Rashmi Gautam going out from jabardasth and mallemala tv
is Rashmi Gautam going out from jabardasth and mallemala tv

అదే కనుక నిజమైతే జబర్దస్త్ కార్యక్రమం యొక్క ప్రస్తుతం వస్తున్న రేటింగ్ కూడా రాకపోవచ్చు అంటూ రష్మీ గౌతమ్‌ యొక్క అభిమానులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరి దారుణంగా మల్లెమాల వారు వ్యవహరించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇలా నీచంగా ప్రవర్తిస్తున్న మల్లెమాల వారికి ముందు ముందు షో రేటింగ్‌ తగ్గించి బుద్ధి చెప్పాల్సిన రోజు వస్తుందంటూ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మల్లెమాల వారు మాత్రం రష్మీ గౌతమ్ ను తప్పిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టిపారేస్తున్నారు.

Advertisement
Advertisement