Home » Entertainment » Dhee Premier League Latest Promo Hyper Aadi Dance With Payal Rajput
Entertainment

Hyper Aadi : పాయల్ తో రెచ్చిపోయిన హైపర్ ఆది.. ఎత్తుకొని మరీ డాన్స్ ..!!

Authored By
aruna
The Telugu News | Updated on: November 13, 2023 3:52 pm
Advertisement

Hyper Aadi : తాజాగా పాయల్ రాజ్ పుత్ మంగళవారం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుల్లితెర షో అయిన ఢీ షో కి గెస్ట్ గా వచ్చారు. ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న ఈ షో ప్రస్తుతం 13 వ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఈ షో కి మంగళవారం టీమ్ పాయల్ రాజ్ పుత్, డైరక్టర్ అజయ్ భూపతి గెస్ట్ లుగా వచ్చారు. ఇక వీళ్లతో హైపర్ ఆది చేసిన హడావుడి మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో హైపర్ ఆది పంచె కట్టుకొని అక్కినేని నాగేశ్వరరావు ను ఇమిటేట్ చేసాడు.

Advertisement

ఈరోజు ఏ హీరోయిన్ వచ్చినా ఆవిడని పైకి ఎత్తి అంటూ తన దైన శైలిలో బోల్డ్ డైలాగ్ లతో రెచ్చి పోయాడు. ఇక తర్వాత అక్కడే కూర్చున్న హీరోయిన్ పాయల్ దగ్గరకు వెళ్లి సాల్సా డాన్స్ చేద్దామా అని ఆమెతో రెండు స్టెప్ లు వేసాడు. ఆది డ్యాన్స్ చూసి పాయల్ బెదిరిపోతుంది. ఇంతలో హడావుడిగా పాయల్ ను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తాడు ఆది. ఏంట్రా మాకు ఈ దరిద్రం అని అజయ్ భూపతి ఓ లుక్ ఇచ్చాడు. ఇక తర్వాత సెమీఫైనల్స్ లో సైరా రాయలసీమ, ఓరుగల్లు వీరులుటీమ్స్ పోటీ పడ్డాయి. ఇందులో ఓరుగల్లు వీరులు తాము పడిన కష్టాలనే డ్యాన్స్ రూపంలో అద్భుతంగా చూపించారు.

డాన్స్ తర్వాత ఓరుగల్లు వీరుల్లోని ఓ డ్యాన్సర్ తన కష్టాలను చెప్పుకున్నాడు. మాది ముస్లిం ఫ్యామిలీ, డ్యాన్స్ అంతగా ఎంకరేజ్ చేయరు. వాళ్లకి తెలీకుండా 4 ఏళ్లు మేనేజ్ చేశాను. తెలిసిపోయిన తర్వాత సపోర్ట్ లేదు. వాళ్లకి కూడా ఉంటది కదా వాళ్ల కొడుకు బాగు పడాలని, నా వల్ల వాళ్లు చాలా బాధలు పడ్డారు. షూట్ అయిపోయిన మార్నింగే వెళ్లి మనీ కోసం మళ్లీ వర్క్ చేసాను. వాళ్లకి ఇంకా మంచి కొడుకు ఉంటే బావుండు, నేను వేస్ట్, మా నాన్నకి ఉన్న అప్పులన్నీ తీర్చేసి రెండు పూటలా భోజం పెట్టాలనేదే నా కల సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఓ కంటెస్టెంట్. ఈ మాటలు విని జడ్జీలు శేఖర్ మాస్టర్, పూర్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడూ లేనిది యాంకర్ ప్రదీప్ కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి