bigg boss actress himaja has responded to the rumors on police raid on her house
Bigg Boss Himaja : నటి హిమజ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. తాజాగా ఆమె గురించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె అరెస్టు అయింది అని ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించింది. ఏకంగా లైవ్ వీడియోను షేర్ చేశారు. ఇంట్లోనే ఉన్నానని, దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నానని, పూజ చేసుకుంటున్నాను అని క్లారిటీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో జేబీ వెంచర్ లోని ఓ విల్లా లో లిక్కర్ పార్టీ జరుగుతుందని, అందులో సినీ సెలబ్రిటీలు ఉన్నారని వార్తలు వచ్చాయి.
దీంతో హిమజపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన లో భాగంగా ఎక్సైజ్ చట్టం పిసిసి కింద కేసు నమోదు చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీపావళి సందర్భంగా హిమజ స్నేహితులకు పార్టీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారట. ఇలా తనమీద తప్పుడు వార్తలు రావడంతో హిమజ ఫైర్ అయ్యారు. కొత్త ఇంట్లో దీపావళి జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ని పిలిచాను, పూజ చేసుకుంటున్నాను పోలీసులు వచ్చారు. చెక్ చేశారు, ఏం జరుగుతుందని ఎంక్వయిరీ చేశారు, ఇల్లంతా వెతికారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా రాస్తున్నారు.
ఇంట్లో రేవ్ పార్టీనా.. ఇంట్లో దీపావళి చేసుకుంటున్నాను అది మీకు తెలియాలని ఇలా లైవ్ లోకి వచ్చి చూపిస్తున్నారు అంటూ హిమజ తెలిపారు. ఇలా రూమర్స్ క్రియేట్ చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకే అందరికి ఇలా క్లారిటీ ఇస్తున్నాను. ఇలాంటి రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తారో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వాళ్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అని హిమజ వీడియోలో చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా హిమజ మీద వచ్చిన వార్తలు నిజం కాదని తేలింది. ఈ ఒక్క వీడియోతో హిమజ అందరికీ క్లారిటీ ఇచ్చారు.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.