Did Actress Rajani, the heroine of those days, experience such hell?
Actress Rajani : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప యాక్టర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఎప్పుడైతే ఇండస్ట్రీని ఒక రేంజ్‌కు తీసుకెళ్లారో అదే విధంగా శ్రీదేవి, జయప్రదల తర్వాత అలనాటి యాక్టర్ రజినీ కూడా తన అందంతో తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రజినీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మజ్ను, అహ నా పెళ్ళంట వంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. నాగార్జున సరసన నటించిన మజ్ను సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే కన్నడ సినీ పరిశ్రమలో విష్ణు,మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో నటించిన రజినీ అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
రాజేంద్రప్రసాద్‌తో అనేక సినిమాల్లో కలిసి నటించిన రజిని 1985లో బ్రహ్మముడి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150కు పైగా సినిమాలు చేసింది. అప్పట్లో రాజేంద్రప్రసాద్ , రజనీ కాంబినేషన్ సూపర్ హిట్. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు నవ్వులు పూయించేవి.ఇక రజినీ చివరిగా 1983లో సినిమాలకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. బెంగుళూరులో జన్మించిన రజిని 1998లో వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.ఈమెకు ముగ్గురు పిల్లలు.
Did Actress Rajani, the heroine of those days, experience such hell?
ముల్లగిరి ప్రవీణ్ అనే ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న రజిని తన వివాహ జీవితంలో ఎంతో నరకం అనుభవించిదట.. భర్తతో పాటు అత్త కూడా డబ్బుల కోసం రజినిని టార్చర్ చేసే వారని తెలిసింది. అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టేవారట.. ఆమె కష్టపడి కొనుకున్న అపార్ట్మెంట్‌ను భర్త తన తల్లిపై రాయించడంతో చేతిలో చిల్లి గవ్వ లేక రజినీ బయటకు వచ్చేసిందట. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి వదిలించుకోవాలని చూస్తున్నారని రజిని కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి రజిని ఒంటరిగా జీవిస్తోంది.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.