Brahmastra Movie : బాలీవుడ్ లో దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు మరియు ఇతర సౌత్ భాషల్లో రాజమౌళి సాయంతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి తన స్థాయిని తగ్గించుకొని మరీ బ్రహ్మాస్త్ర సినిమా సమర్పణకు ఓకే చెప్పాడు. ఈ కారణం తో రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమా ని సమర్పించేందుకు ఓకే చెప్పాను అంటూ పలు సందర్భాల్లో చెప్పాడు.. కానీ ఆ మాటలను ఏ ఒక్కరు నమ్మడం లేదు. రాజమౌళి ఎందుకు ఈ సినిమా సమర్పణకు ముందుకు వచ్చాడో అనేది చాలా మందిలో ఇంకా క్లారిటీ రాని ప్రశ్న గానే ఉంది. సరే సినిమా ప్రమోషన్ కి, పబ్లిసిటీకి ముందు పడి చేస్తాను అంటూ బ్రహ్మాస్త్ర సమర్పణ కు ఓకే చెప్పి ఉంటాడు కానీ మరీ దారుణంగా తన స్థాయిని తగ్గించుకొని మరి సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆయన సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో కూడా బ్రహ్మాస్త్ర సినిమా కోసం పాల్గొన్నారు. ఇప్పటి వరకు తన సినిమాల కోసమే ఆ కార్యక్రమం లో పాల్గొనని రాజమౌళి అనూహ్యంగా సుమ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాల యొక్క యూనిట్ సభ్యులు క్యాష్ కార్యక్రమంలో పాల్గొనలేదు. రాజమౌళి వంటి స్టార్ క్యాష్ షో కి వెళ్లడం ను ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమా కోసం మరీ అంత దిగజారడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం రాజమౌళి ని సమర్ధిస్తున్నారు.
రాజమౌళి తాను పట్టిన సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు అంటూ చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం.. ఉదాహరణ అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఎలాగూ కంటెంట్ ఉండదు కనుక ప్రమోషన్ తో అయినా సినిమాను హైపు క్రియేట్ చేసి ఒక మోస్తరు వసూలను క్రియేట్ చేసేందుకు రాజమౌళి ఇలా తన స్థాయిని దిగజార్చుకున్నాడు అని కొందరు…. మరీ దిగజారి కార్యక్రమాల్లో పాల్గొని సినిమా గురించి ఆకాశాన్ని తాకేలా కామెంట్ చేస్తున్నాడు అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి మరీ నిజంగా అంత దిగజారాడా మీరేమనుకుంటున్నారు మాకు తెలియ జేయండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.