Did You Know about Soundarya life after she passes away
Soundarya : అందం, అభినయం పుష్కలంగా ఉండే నటీమణులలో సౌందర్య ఒకరు. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఆవిడ సొంతం. స్తుతం నటి సౌందర్య భౌతికంగా లేకపోయినా ఆమె నటించిన చిత్రాలు మాత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. దీంతో ఈ స్టార్ హీరోలతో సౌందర్యకి మంచి స్నేహం ఉండేది. అయితే సౌందర్య మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమె మరణం తర్వాత ఆస్తుల వివాదాలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడయో చూడండి. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ అందాల నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఉండేది సౌందర్య. ఈవిడ టాలీవుడ్‌లో చాలా మంది హీరోలతో నటించింది. అయితే నటి సౌందర్యకి ప్రముఖ స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేశ్ తో ఎక్కువగా సన్నిహితంగా ఉండేది.
విక్టరీ వెంకటేష్ కూడా అప్పుడప్పుడు నటి సౌందర్య ఇంటికి వెళ్లడం మరియు సౌందర్య ఇంట్లో జరిగే వేడుకలకు హాజరవడం వంటివి చేస్తూ ఉండేవాడు. దీంతో కొందరు ఏకంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని నటి సౌందర్య కి హీరో విక్టరీ వెంకటేష్ తో లవ్ అఫైర్ ఉందని అనుకున్నారు. కాని వెంకటేశ్ తనకు చాలా మంచి స్నేహితుడని చెప్పి వార్తలని ఖండించింది. ఈమె ఎంత స్టార్ డం సంపాదించుకున్నా.. చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్సెక్క్యూర్ గా ఫీలయ్యేది కాదు. అందుకే ఈమె గురించి అప్పటి దర్శక నిర్మాతలు చాలా గొప్పగా చెబుతుంటారు. అయితే 2004 వ సంవత్సరంలో ఈమె ఎవ్వరూ ఊహించని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉండగా.. ఈమె ఆస్తి అప్పట్లోనే కొన్ని వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.ఈమె ఆస్తి విషయం పై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈమె ఆస్తిని ఈమె భర్త అనుభవిస్తున్నాడని..
Did You Know about Soundarya life after she passes away
సౌందర్య తల్లిదండ్రులకు దక్కాల్సిన వాటాని కూడా ఇవ్వడం లేదని కేసు నడుస్తూనే ఉంది. సౌందర్య భర్త పేరు జి.ఎస్. రఘు.ఇతను సౌందర్యకి దగ్గర బంధువే..ఇతన్ని పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకి ఇష్టం లేదు. వాళ్ళ మాట కాదని సౌందర్య రఘుని 2003 లో పెళ్లి చేసుకుంది. రఘు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా.5 ఏళ్ళ పాటు వీళ్ళ దాంపత్య జీవితం కొనసాగినా వీళ్ళకి ఎటువంటి సంతానం లేదు. ఇక సౌందర్య పోయిన కొంతకాలానికి అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రఘు. ప్రస్తుతం ఇతను గోవాలో స్థిరపడ్డాడని తెలుస్తుంది. సౌందర్య బతికి ఉంటే ఎన్నో మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మరింతగా మెప్పించేది. సినిమాలలో సక్సెస్ అయిన సౌందర్య రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది. బిజెపి పార్టీ తరఫున రాజకీయాల లోకి దూసుకు వెళ్తున్న సమయంలో ఈమె హెలికాప్టర్లో బయలుదేరగా ప్రమాదం చోటు చేసుకుంది. సౌందర్య సోదరుడు అమర్ నాథ్ కూడా మరణించాడు.
అయితే ఆమె బంధువులు మాత్రం ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నట్లు గా సమాచారం తెలుస్తోంది. సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త రఘు ఒక వైపు ఉండగా మరొక వైపు సౌందర్య మరదలు అమర్ నాథ్ భార్య నిర్మల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నది. సౌందర్య కి 6 కాస్ట్లీ ప్రాపర్టీస్ తో పాటుగా.. భారీగా బంగారం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి కుటుంబానికి రెండు ఇల్లు ఉండగా అందులో ఒకటి అమర్నాథ్ కుమారుడు పేరు పైన ఉందట. మరొక ఇల్లు సౌందర్య మరియు ఆమె సోదరుడి పైన రాసి ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ హీరో జగపతిబాబు తో కూడా నటి సౌందర్య కి ఎఫైర్ ఉందని కొందరు తప్పుడు ప్రచారాలు చేశారు. దానిపై జగపతి బాబు స్పందిస్తూ నటి సౌందర్య తనకి చాలా మంచి మిత్రరాలని అలాగే అఫైర్ అంటే అర్థం సంబంధమని అయితే నాకు నటి సౌందర్య తో మంచి అఫైర్ ఉందని కూడా స్పష్టం చేశాడు
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.