Actress Aamani : వాళ్లు నన్ను గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. సీనియర్ నటి ఆమని కామెంట్స్!
Actress Aamani : అలనాటి సీనియర్ హీరోయినల్లో ఒకరైన ఆమని సంచలన కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమలో పెనుభూతంలా మారిన క్యాస్టింగ్ కౌచ్‌పై మొదటి సారి పెదవి విరిచారు. ఆమని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి చాలా మంది అభిమానుల ఆదరాభిమానాలను సంపాదించుకున్నారు. శుభలగ్నం సినిమాలో జగపతి బాబు సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆమని.. ఆ తర్వాత కూడా మావిచిగురు, మిస్టర్ పెళ్లాం, శుభసంకల్పం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు ఆమని గ్లామర్ కంటే ఆమె నటనకే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండటంతో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో అభిమానులను సొంతం చేసుకోగలిగారు.
ఈవిడ సినిమాలు చూసిన వారంతా ఇలాంటి డిఫరెంట్ రోల్స్‌ను ఒక్క ఆమని మాత్రమే చేయగలదని అనుకునేవారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా మెప్పించగలిగిన దిగ్గజ దర్శకులైన ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ, కే రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలోనూ ఆమని సినిమాలు చేశారు. ఆమని బెంగుళూరులో జన్మించగా.. ఆమె కుటుంబీకులు మాత్రం ఉమ్మడి ఏపీకి చెందినవారు. ఆమని తండ్రి బెంగుళూరులో స్థిరపడగా ఆయన కూడా సినిమాల్లోనే చాలా కాలం పనిచేశారు. ఇండస్ట్రీలో ఆమని తండ్రి డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసే సమయంలోనే ఆమనికి సినిమాలపై ఆసక్తి పెరిగి చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించింది.
director invited me to the guest house Actress Aamani comments
సినిమా అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా అంత సులువుగా చాన్సులు రాలేదు. కొంత మంది దర్శకులు ఆమని ఫోటోస్ చూసి ఓకే చెప్పేవారని.. ఆ తర్వాత నేరుగా చూసి రిజెక్ట్ చేసేవారని తెలిసింది. ఇక ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడినట్టు గుర్తుచేసుకున్నారు. సినిమా అవకాశం కోసం ఓ ఆడిషన్‌కు వెళ్లగా అక్కడివారు రేపు గెస్ట్‌హౌస్‌కు రావాలని చెప్పారని, అది కూడా సింగిల్‌గా రావాలని చెప్పినట్టు గుర్తుచేసుకుంది. సింగిల్‌గా రావాలని చెప్పడంతో తనకు విషయం అర్థమై వెళ్లలేదని తెలిపింది.
