Pushpa 2 The Rule : పుష్ప‌2 ట్రైల‌ర్ చూశాక అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న‌.. అర‌గుండుతో క‌నిపించిన నటుడు ఎవ‌రని ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 18 November 2024, 6:00 pm
  •  Pushpa 2 The Rule : పుష్ప‌2 ట్రైల‌ర్ చూశాక అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న‌.. అర‌గుండుతో క‌నిపించిన నటుడు ఎవ‌రని ?

Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్క‌ల మాస్టారు సుకుమార్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం పుష్ప2.. సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేశారు. గాంధీ మైదాన్ లో భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్ కు రెండు లక్షల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలైన ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ను దక్కించుకుంటోంది. సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. ట్రైలర్ లో డైలాగులు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పటివరకు మొదటి స్థానంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, రెండో స్థానంలో ప్రభాస్ సలార్ నిలిచాయి. వీటిని వెనక్కినెట్టి 15 గంటల వ్యవధిలోనే 42 మిలియన్ల వ్యూస్ ను పుష్ప2 దక్కించుకుంది. 24 గంటల వ్యవధి అంటే ఇంకా భారీగా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది.

Pushpa 2 The Rule ఇన్ని హైలెట్స్..

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. హిందీ లో 29 మిలియన్ వ్యూస్, తమిళం లో 3.7, మళయాళం 2, బెంగాలీ లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అన్ని భాషలకు కలిపి 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది యూట్యూబ్ లో నమోదైన వ్యూస్ అని, రియల్ టైం చూసుకుంటే 100 మిలియన్లను దాటివుంటుందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ కు 24 గంటల్లో 70 మిలియన్ల వ్యూస్ రాగా, పుష్ప2 ట్రైలర్ కు 24 గంటలు గడవకముందే 70 మిలియన్లను దాటడం విశేషం. పుష్ప 2 ట్రైలర్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. గ్రేట్ వర్క్ అని ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేసి వార్నర్ బాయ్ అభినందించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pushpa 2 The Rule : పుష్ప‌2 ట్రైల‌ర్ చూశాక అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న‌.. అర‌గుండుతో క‌నిపించిన నటుడు ఎవ‌రని ?

Pushpa 2 The Rule : పుష్ప‌2 ట్రైల‌ర్ చూశాక అంద‌రిలో ఒక‌టే ప్ర‌శ్న‌.. అర‌గుండుతో క‌నిపించిన నటుడు ఎవ‌రని ?

ట్రైలర్‌లో ఒక్కో షాట్ గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక ట్రైలర్‌లో బాగా హైలేట్ అయిన పాత్రలో అరగుండు గెటప్‌లో కనిపించిన రోల్ కూడా ఒకటి. కేవలం కొన్ని సెకండ్ల పాటు కనిపించిన ఆ రోల్ గురించి ఇప్పుడు సర్వాత్రా ఆసక్తి నెలకొంది.ఆ రోల్‌లో నటించింది తారక్ పొన్నప్ప. రీసెంట్‌గా రిలీజైన దేవరలో బైరా కొడుకుగా నటించింది కూడా ఆయనే. కాగా.. మెడలో చెప్పులదండతో.. సగంగుండుతో ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. పుష్ప2లో పొన్నప్ప రోల్ కాస్త నెగిటీవ్ షేడ్స్‌తో పాటు పాజిటీవ్ షేడ్స్‌ కలిసి ఉండనుందట. అంతేకాదు తన రోల్ ఏదో వచ్చి పోయినట్లు కాకుండా.. సినిమాను మలుపు తిప్పుతుందని ఆయనే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్‌ చేసింది. ఆమె ఐటెం సాంగ్ కూడా మూవీకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్ కానుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp