Pushpa 2 Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రంకెలు వేస్తున్న పుష్ప‌2.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రంకెలు వేస్తున్న పుష్ప‌2.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రంకెలు వేస్తున్న పుష్ప‌2.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..!

Pushpa 2 Collections : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన‌ పుష్ప పార్ట్‌ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై చాలా పెద్ద విజ‌యం సాధించింది. మూవీ రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. నార్త్‌ ఇండియాలో పుష్ప సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమాకి మొదట మిశ్రమ స్పందన వచ్చినా లాంగ్‌ రన్‌లో రికార్డ్‌ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి పార్ట్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకి వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అంద‌రు షాక్ అవుతున్నారు. పుష్ప 2 ది రూల్ వసూళ్ల పరంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా నిలవడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే.

Pushpa 2 Collections బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రంకెలు వేస్తున్న పుష్ప‌2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే

Pushpa 2 Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రంకెలు వేస్తున్న పుష్ప‌2.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..!

Pushpa 2 Collections పుష్ప‌గాడి రచ్చ‌..

ఎందుకంటే ఇప్పటివరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే దాదాపు రూ.140 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా సాధించింది. ఇందులో కేవలం ఇండియా అడ్వాన్స్‌ బుకింగ్సే రూ.100 కోట్ల వరకు ఉన్నాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.40 కోట్ల వరకు ఉన్నాయి. ముందు రోజు వేసిన లిమిటెడ్ ప్రీమియర్స్‌కే ఇప్పటి వరకు రూ.10.34 కోట్ల వసూళ్లు వచ్చాయి. భారత దేశ సినిమా చరిత్రలో 15 రాష్ట్రాల్లో రూ.కోటికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన మొదటి సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. బీహార్, ఒడిశా, ఛత్తీస్‌ఘర్ లాంటి రాష్ట్రాలు కేవలం 500 షోలతోనే రూ.కోటికి పైగా గ్రాస్‌ను సాధించాయి.వరల్డ్ వైడ్ గా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 617 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకుని 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా 10 వేల 400 వరకు థియేటర్స్ లో రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా బుకింగ్స్ ను హిందీలో 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా ఓవర్సీస్ లో 4.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా ఇతర వర్షన్ లు పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఉంది. వరల్డ్ వైడ్ గా గ్రాస్ బుకింగ్స్ లెక్క 138-140 కోట్ల రేంజ్ లో ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…తెలుగు రాష్ట్రాల్లో 90-95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే ఛాన్స్ ఉంది ప్రీమియర్స్ తో కలిపి లెక్క ఇంకా పెరగవచ్చు…ఇక హిందీలో సినిమా మొదటి రోజు 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది.ఇక తమిళ్ కేరళ మరియు కర్ణాటక కలిపి సినిమా 26-30 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇండియాలో సినిమా 190-195 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవ‌ర్సీస్‌లో 6.5-7 మిలియన్ డాలర్స్ రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది. అంటే 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంటుంద‌ని టాక్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది