Pushpa 2 Ticket Price : పుష్ప ది రూల్ కాదు.. పుష్ప ది లూట్.. ఇలా ఎందుకు అంటున్నామంటే..!
ప్రధానాంశాలు:
Pushpa 2 Ticket Price : పుష్ప ది రూల్ కాదు.. పుష్ప ది లూట్.. ఇలా ఎందుకు అంటున్నామంటే..!
Pushpa 2 Ticket Price : ఇటీవలి కాలంలో పెద్ద సినిమాల టిక్కెట్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడం ఫ్యాన్స్‌ను హడలెత్తిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో..లేకపోతే బెన్ ఫిట్ షో చూద్దామనుకున్న వారు టికెట్ రేట్లు చూసి షాక్ అవుతున్నారు. సింగిల్ స్క్రీన్ టికెట్ 150, మల్టీప్లెక్స్‌లో 250వరకు ఉండే టికెట్ ఏకంగా..ట్రిపుల్ అయిపోవడంతో వామ్మో ఇవేం రేట్లు అంటూ మీమ్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప-2 అయిపోయాక సంక్రాంతికి గేమ్‌ఛేంజర్, డాక్ మహారాజ్ మూవీస్ వస్తున్నాయి. మూడు పెద్ద సినిమాలు కావటంతో ప్రేక్షకులు మూడు సినిమాలు చూడాలనుకుంటారు. కానీ పుష్ప-2 టికెట్ రేట్ల మాదిరిగానే ఈ మూడు సినిమాలకు పెంచితే థియేటర్‌కు వెళ్లి మూవీ చూడాలంటే ఆలోచించాల్సిదేనంటున్నారు.
Pushpa 2 Ticket Price మరీ ఇంతనా..
పుష్ప-2 Pushpa 2 The Rule బెనిఫిట్ షో మల్లిఫ్లెక్స్ టికెట్ రేటు 1200 దాక పెరిగిపోవడంతో డై హార్డ్ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. ముంబైలోని అత్యంత అధునాతన టెక్నాలజీతో నడిచే మల్టీప్లెక్స్ మైసన్ పీవీఆర్, జియో వరల్డ్ డ్రైవ్‌లో పుష్ప 2 సాధారణ టికెట్ ధర రూ.700లు కాగా, అందులోని స్పెషల్ స్క్రీన్స్‌లో పుష్ప 2 ను చూడాలి అంటే రూ.3000లు చెల్లించాల్సిందే. ఇంత రేట్లు పెట్టి సినిమాని చూడాలంటే సామాన్యుడికి కుదిరేపనేనా. నిర్మాతలు పెట్టిందంతా ఒక్క రోజే రాబట్టాలని అనుకోవడం ఎంత వరకు కరెక్ట్, అసలు ప్రభుత్వాలు వారికి ఎలా పర్మీషన్స్ ఇస్తున్నాయి అని కొందరు చెబుతున్న మాట. డై హార్డ్ ఫ్యాన్స్ ఎప్పుడైన తమ హీరో సినిమా మొదటి షో చూడాలని అనుకుంటాడు.కాని ఈ రేంజ్‌లో రేట్లు పెంచితే అది వారి వల్ల అయ్యే పనేనా. ఒక పది మంది కలిసి సినిమా చూడాలని అనుకుంటే దాదాపు 8000 వరకు అవుతుంది.
ఇంత ఖర్చు పట్టే స్థోమత అందరికి ఉంటుందా. గతంలో టిక్కెట్ రేట్లు వంద రెండొందలు పెంచితే ఇప్పుడు ఏకంగా 800 పెంచడం అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు అభిమానుల అభిమానాన్ని ఇలా క్యాష్ చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీకే మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తుండగా, మరి ఆ పెట్టిన మొత్తాన్ని అభిమానులపై శటగోపం పెట్టి నిర్మాతలు లాక్కోవడంలో తప్పు లేదని కొందరి మాట.పుష్ప 2 టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై డిసెంబరు 3న విచారణ జరిగింది. సినిమా విడుదలను ఆపలేమని చెబుతూ, తదుపరి విచారణను డిసెంబరు 17కు వాయిదా వేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు బాగా పెరగడమనేది పుష్ప 2 తోనే మొదలు కాలేదని, బాహుబలి, ఆర్ఆర్ఆర్, దేవర వంటి సినిమాలకూ పెంచారని అల్లు అర్జున్ అభిమానులు చెబుతున్నారు. రికార్డుల కోసం ఇలా లూట్ చేయడం ఏ మాత్రం తగదని కొందరు చెబుతున్న మాట.