
differences between Allu family and Mega family have settled
Mega Family : మెగా ఫ్యామిలీలో విభేదాలు అనేది ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తలు కాదు.. గడచిన నాలుగైదు సంవత్సరాలుగా ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక సమయంలో అల్లు అర్జున్ (allu arjun ) మరియు రామ్ చరణ్ ( ram charan )మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని ప్రచారం జరగగా, మరో సమయంలో అల్లు అరవింద్ ( allu aravind ) మరియు చిరంజీవి ( chiranjeevi )మధ్య ఏదో గొడవ జరుగుతుంది అంటూ ప్రచారం మొదలైంది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ మరియు ఆయన అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఆ గొడవలను అల్లు అరవింద్ బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాడని రకరకాలుగా పుకార్లు చేశాయి. ఈ సమయంలోనే అల్లు అర్జున్ మరియు ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా అల్లు రామలింగయ్య వందవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ మీడియాకు కనిపించారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా కనిపించడంతో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయంటారేంటి ఇంత హ్యాపీగా కలిసి ఉంటే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, కొందరు మాత్రం కెమెరాల ముందు నవ్వుతూ ఫోటోలకు ఫోజు ఇస్తే కోల్డ్ వార్ లేనట్లా అంటూ కామెంట్ చేస్తున్నారు. జనాలు చూడడానికి ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి ఉండవచ్చు కదా వారి మధ్య కోల్డ్ వార్ జరగడం లేదని ఎలా చెప్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ రీసెంట్ ఫొటోస్ మెగా ఫ్యామిలీ లో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పకనే చెబుతున్నాయి.
differences between Allu family and Mega family have settled
ప్రస్తుతం ఆ ఫోటోలు జనాల్లో చర్చనీయాంశంగా మారాయి, కొందరు మెగా ఫ్యామిలీలో విభేదాలు లేవని సంతోషిస్తుండగానే మరి కొందరు మాత్రం అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఎలాంటి విభేదాలు బయట పడవద్దనే ఉద్దేశంతో కెమెరా ముందు కాస్త నటించారని.. వాళ్లు సహజంగానే మంచి నటులు కనుక వాళ్లంతా కలిసి పోయినట్లుగా అనిపిస్తుందని విమర్శలు చేస్తున్నారు. యాంటీ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ ఇలాంటి విమర్శలు చేస్తూనే ఉంటారు. వాటిని మెగా ఫాన్స్ తిప్పి పడుతూనే ఉంటారు. మెగా ఫ్యాన్స్ అంటున్న మాట ఏంటంటే మెగా ఫ్యామిలీలో అంతా కలిసే ఉన్నారు.. ఏ ఒక్కరి మధ్య గొడవలు లేవు.. విభేదాలు లేవు.. కోల్డ్ వార్ అసలే లేదు. ఇది నిజమైతే అంతా హ్యాపీనే కదా..!
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.