Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ని నరకయాతన పెడతారని.. కొందరు మాజీ కంటెస్టెంట్స్ అంటూ ఉంటారు. చూడడానికి వారంతా హ్యాపీగా ఉంటారు కానీ.. కెమెరా కంటికి కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకోవడం, వాళ్లు కష్టపడ్డ సందర్భాలను కెమెరాలు చూపించక పోవడం జరుగుతుంటాయని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ చెప్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్ లో కొన్నిసార్లు టాస్కుల్లో గాయాల పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో ఉన్న మానసిక స్థితి కారణంగా కొట్టుకునే స్థితి వరకు వెళ్తారు. అప్పుడు ఏకంగా ప్రాణా పాయ స్థితి తప్పదంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజా వీకెండ్ ఎపిసోడ్ లో గీతూ రాయల్ ( geethu rayal ) కి చంటి పానీపూరి ఇచ్చాడు. అందులో పానీ లేదు కానీ పూరీలో ఉప్పేసి ఇచ్చాడు.
సాధారణంగా అయితే కొద్ది మొత్తం ఉప్పు నాలికపై పెట్టుకుంటేనే ఒళ్ళు జలదరించి వాంతి వచ్చినట్లుగా అవుతుంది. అలాంటిది పిరికేడు ఉప్పుని పానీపూరి పానీపూరి నిండా నింపి ఆమెకు నోట్లో పెట్టిన చంటి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆయన లోపట ఉన్నాడు కాబట్టి ఫ్రస్టేషన్ తో ఉన్నాడు.. పెట్టాడు అనుకోవచ్చు. బయట ఉన్న నాగార్జున ఏం ఆలోచిస్తున్నాడు. బిగ్ బాస్ నిర్వాహకులైన కూడా అంత ఉప్పు పెట్టకూడదు అనే విషయాన్ని చెప్పాలి కదా, ఏమాత్రం వారు అడ్డుకోలేదు. దాంతో చంటి ( chanti ) పిరికేడు ఉప్పుని గీతు రాయల్ నోట్లో పోసేసాడు, ఆమె పంతానికి పోయి దాన్ని మింగడానికి ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత ఆమె పరిస్థితి సీరియస్ అయింది.
వాంతులు చేసుకోవడంతో పాటు చాలా ఇబ్బంది పడింది. ఆమె గొంతు కూడా పోయిందని ఇతర కంటెస్టెంట్స్ ఆ తర్వాత అన్నారు. అంత ఉప్పు తింటే ఎవరికైనా అత్యంత డేంజర్ అవుతుంది. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకి అది మరీ డేంజర్, ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయాన్ని తెలుసుకోకుండా మరి చిల్లరగా బిగ్ బాస్ వాళ్లు ఇలా ఉప్పుని నోట్లో పోయించడం చంటి అంత ఉప్పుని తీసుకొని ఆమెకి ఇవ్వడం ఏమాత్రం సరి కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రాణాలు పోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటూ నాగార్జునను సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి టాస్కులు మళ్లీ పెట్టకుంటే మంచిదని కంటెస్టెంట్స్ ని మనుషుల్లాగా చూడాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.